Adilabad SP Akhil Mahajan, taking swift action on public grievances day, received 26 complaints and directed officers concerned to resolve each issue promptly and responsibly…

బాధితుల ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థంగా స్పందిస్తున్న అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ప్రజా ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా 26 ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత పోలీసు అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Adilabad SP Akhil Mahajan, taking swift action on public grievances day, received 26 complaints and directed officers concerned to resolve each issue promptly and responsibly.

అదిలాబాద్ జిల్లా కేంద్ర పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల దినోత్సవంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఓపికగా విన్నారు. జిల్లావ్యాప్తంగా వచ్చిన దాదాపు 26 ఫిర్యాదులను స్వీకరించిన ఆయన, బాధితుల సమస్యలను ప్రాధాన్యంతో పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణమే ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలించి, పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

ఫిర్యాదులలో భూ వివాదాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్ల వల్ల మోసపోయినవారి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. వీటిపై పూర్తి ఆధారాలతో కేసులు నమోదు చేయాలని ఎస్పీ అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న కేసులు, కుటుంబ కలహాలు, దంపతుల మధ్య వివాదాలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు వంటి అనేక సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల దినోత్సవాన్ని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత పోలీస్ స్టేషన్లకు లేదా నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. సుదూర ప్రాంతాల వారు తమ ఫిర్యాదులను వాట్సాప్‌ ద్వారా 8712659973 నంబర్‌కు పంపవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిణి జైస్వాల్ కవిత, వామన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *