A special birthday poster was released for actor Yogi Babu from the film “Gurram Papireddy”, starring Naresh Agastya. He will be seen in the role of ‘Udraju’…నరేష్ అగస్త్య

నరేష్ అగస్త్య నటిస్తున్న “గుర్రం పాపిరెడ్డి” సినిమా నుంచి యోగిబాబుకు బర్త్‌డే శుభాకాంక్షలతో పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆయన ‘ఉడ్రాజు’ పాత్రలో అలరించనున్నారు.

A special birthday poster was released for actor Yogi Babu from the film “Gurram Papireddy”, starring Naresh Agastya. He will be seen in the role of ‘Udraju’.

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం “గుర్రం పాపిరెడ్డి”. డా. సంధ్య గోలీ సమర్పణలో వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్న ఈ సినిమాకు మురళీ మనోహర్ దర్శకత్వం వహిస్తున్నారు. డార్క్ కామెడీ నేపథ్యంలో ఇప్పటివరకు తెరపై చూడనిది కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ రోజు ఈ చిత్రంలో నటిస్తున్న ప్రముఖ తమిళ నటుడు యోగిబాబుకు బర్త్‌డే శుభాకాంక్షలతో ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన “ఉడ్రాజు” అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. యోగిబాబు ప్రదర్శన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది.

“గుర్రం పాపిరెడ్డి” సినిమాను పర్‌ఫెక్ట్ డార్క్ కామెడీగా మలచుతున్నారు. హైదరాబాద్ నగర నేపథ్యంలో, కాంటెంపరరీగా, స్టైలిష్‌గా డిజైన్ చేసిన క్యారెక్టర్లతో దర్శకుడు మురళీ మనోహర్ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *