మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గచ్చిబౌలీలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన 12వ క్లాస్ ను పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. ఈ సందర్భంగా తాను చదువుతున్న స్కూల్ లో ‘12 క్లాస్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పట్టాతో పాటు ‘కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్’ (సి ఎ ఎస్) విభాగంలో గొప్ప ప్రతిభను ప్రదర్శించినందుకు విభాగంలో ఎక్స్ లెన్స్ అవార్డును అందజేశారు… భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనుమడిని సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాతగారు నాయనమ్మలైన సీఎం కేసీఆర్ శోభమ్మ దంపతులు, తల్లిదండ్రులు కేటిఆర్ శైలిమ లు, చెల్లెలు అలేఖ్య తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.