పోయిన సెల్ ఫోన్ గుర్తించేందుకై సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) – డీజీపీ అంజనీ కుమార్

 

హైదరాబాద్, ఏప్రిల్ 18 :: చోరీ కి గురైన లేదా పోగొట్టుకున్న సెలఫోన్ ల జాడను తెలుసుకునేందుకై సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) అనే విధానాన్ని కొత్తగా ప్రవేశ పెడుతున్నట్టు డీజీపీ అంజనీ కుమార్ ప్రకటించారు. ఈ సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) విధానంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్.పి. లు. సీపీ లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు అవగాహన కల్పించారు. టెలికాం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాజశేఖర్, డైరెక్టర్లు మురళి కృష్ణ, రాఘవ రెడ్డి , అడిషనల్ డీజీ మహేష్ భగవత్ లతో కలసి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ డీజీ లు అనీల్ కుమార్, షికా గోయల్, సంజయ్ కుమార్ జైన్, శివధర్ రెడ్డి, అభిలాష బిస్త్, ఐజి లు కమలాసన్ రెడ్డి, చంద్రశేఖర్  రెడ్డి, షానవాజ్  కాసీం, డీఐజీ రమేష్ రెడ్డి, ఎస్.పి లు లావణ్య, విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.
 ఈ సందర్భంగా డిజిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ, అత్యధికంగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లలో సెల్ ఫోన్ ప్రధానంగా మారిందని, ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ ల చోరీ, మిస్సింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. పోయిన సెల్ ఫోన్ లను గుర్తించేందుకై ప్రవేశ పెడుతున్న సీఈఐఆర్ గురించి సామాన్య ప్రజలలో గ్రామాలలో పట్టణాలలో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రపంచ టెలికాం దినోత్సవంగా మే 17 న ఈ విధానాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు.
    అడిషనల్ డీజీ మహేష్ భగవత్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని  750 పోలీస్ స్టేషన్లలో పోలీస్ ఆఫీసర్లకు ఈ విధానంపై శిక్షణనిస్తున్నామని తెలిపారు.  సెల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి  సిఇఐఆర్ గురించి  తెలిసేలా పోలీస్ స్టేషన్ పరిధిలో సర్కిల్, డివిజన్ పరిధిలో బ్లూ కోల్డ్స్ పెట్రో కార్ సిబ్బంది ప్రతిరోజు  అవగాహన కల్పించాలని తెలిపారు.  సెల్ ఫోన్ పోయిందని ఎవరైనా పోలీస్ స్టేషన్ కు వస్తే  సంబంధిత రిసెప్షనిస్ట్  సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిల్ రిజిస్టర్  యాప్ లో  పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. సెల్ ఫోన్/ చరవాణి ఎక్కడైనా పడిపోయిన ఎవరైనా దొంగలించుకుని పోయిన  వెంటనే CEIR  లో రిజిస్ట్రేషన్ చేస్తే దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ  CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) అనే అప్లికేషన్  ద్వారా చరవాణి ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా చోరికి గురైనా అట్టి చరవాణి లను వెతికి పట్టుకోవడానికి ఎంతో చేయూతనిస్తుందని అన్నారు.  

కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రవేశపెట్టింది. ఇందుకోసం www.ceir.gov.in వెబ్ సైట్ లో లాగిన్ కావాలి. అందులో రెక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి పోయిన చరవాణి లోని నంబర్లు, ఐఏంఇఐ నంబర్లు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు ఎక్కడ పోయింది, రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడి, ఓటిపి (OTP) కోసం మరో చరవాణి నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడి నెంబర్ వస్తుంది సంబంధిత ఐడి ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మొబైల్ ఏ కంపెనీ అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఫోన్ పని చేయకుండా చేస్తుంది. చరవాణి దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి ఆన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. ఐడి నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. చరవాణి పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలని CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

సీపీఆర్ఓ, డీజీపీ కార్యాలయంచే జారీ చేయనైనది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *