తెలంగాణ ఉద్యానాభివృద్ధి ప్రణాళిక -2035 ఆవిష్కరణ ..Telangana

: Screenshot from ‘:  https://x.com/TelanganaCMO   ” (used under fair use for reporting)           

తెలంగాణ ఉద్యానాభివృద్ధి ప్రణాళిక -2035 ఆవిష్కరణ | Horticulture Vision 2035 unveiled for Telangana
ఉద్యాన పంటల విస్తీర్ణం, ఉత్పాదకత పెంపు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించింది.
Telangana unveils a comprehensive roadmap to boost horticulture production and productivity till 2035.

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక -2035’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 2035 వరకు ఉద్యాన పంటల ఉత్పత్తి, విస్తీర్ణం, దిగుబడులను పెంచేందుకు అవసరమైన వ్యూహాలను ఈ ప్రణాళికలో ప్రతిపాదించారు.

Chief Minister Revanth Reddy unveiled the “Telangana Horticulture Development Plan – 2035”, prepared by Sri Konda Laxman Telangana State Horticultural University. The plan sets clear targets and strategies to enhance production, acreage, and yield of horticultural crops across the state by 2035.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు, విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ డి. రాజిరెడ్డి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

The event was held at Dr. B.R. Ambedkar Telangana Secretariat in the presence of Minister Tummala Nageswara Rao, Chief Secretary K. Ramakrishna Rao, University Vice-Chancellor Dr. D. Rajireddy, and senior officials.

ప్రణాళిక ప్రకారం, రాబోయే ఐదేళ్లలో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటలు విస్తరించనున్నాయి. రూ. 921.40 కోట్ల సాగు పెట్టుబడి, రూ. 942.50 కోట్ల డ్రిప్ సేద్య పెట్టుబడులు ప్రతిపాదించబడ్డాయి. 1 రూపాయి పెట్టుబడికి 4 రూపాయల లాభాలు సాధ్యమని అంచనా వేశారు.

As per the plan, over the next five years, fruit cultivation will expand across 1.32 lakh acres and vegetable cultivation across 2.45 lakh acres. With an investment of ₹921.40 crore in irrigation and ₹942.50 crore in drip systems, the plan estimates a fourfold return on every rupee invested.

#SKLTHU రూపొందించిన కొత్త రకాలు, ఆధునిక సాంకేతికతను విస్తృతంగా అమలు చేస్తే సంవత్సరానికి రూ.1341 కోట్ల ఉత్పత్తి విలువ సాధ్యమని ప్రణాళిక పేర్కొంది.

The plan projects an annual production value of ₹1,341 crore if advanced technologies and crop varieties developed by SKLTHU are implemented effectively.

మిగులు ఉత్పత్తి, లోటు పంటల ఆధారంగా కార్యాచరణను రూపొందించి, ఉత్పాదకత సామర్థ్యం పెంచడం, పంట యాజమాన్యం, మార్కెటింగ్ బలోపేతం వంటి అంశాలపై సమగ్ర దృష్టి సారించామని అధికారులు వెల్లడించారు.

Officials explained that the action plan focuses on balancing surplus and deficit crop production, improving productivity, strengthening crop management, and enhancing market linkages.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *