రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖలను అప్రమత్తంగా ఉంచారు…With the Meteorological Department

Image: Screenshot from ‘ :  https://x.com/TelanganaCMO              ” (used under fair use for reporting)

రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖలను అప్రమత్తంగా ఉంచారు. కలెక్టర్లు, విద్యుత్, రోడ్లు, విద్యా సంస్థలు మరియు అత్యవసర సేవల శాఖలు ప్రతి పరిస్థితికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

With the Meteorological Department warning of heavy rains in the state over the next two days, Chief Minister Revanth Reddy has directed all departments to remain alert. Collectors, electricity, roads, educational institutions, and emergency services have been instructed to be prepared for any situation.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలర్ట్‌లో ఉండి పరిస్థితిని సరిగ్గా సమీక్షించుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టంగా సూచించారు.

అలాగే, అన్ని కాజ్‌వేలను పరిశీలించి, రోడ్లపై వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, ముందుగానే ట్రాఫిక్‌ను నిలిపివేయాలని, ప్రమాదం నివారించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టి, వేలాడుతున్న వైర్లను వెంటనే తొలగించాలని సూచించారు.

దసరా సెలవులు ఉన్నప్పటికీ, విద్యా సంస్థలు వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు అత్యవసరమైన పరిస్థితులలో మాత్రమే రోడ్లపైకి రావాలని, రోడ్డు, ట్రాఫిక్ మరియు విద్యుత్ సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి హైలైట్ చేశారు. హైదరాబాద్‌లో GHMC, HYDRAA, HMWSSB, NDRF, SDRF బృందాలను తక్షణ చర్యలకు సిద్ధంగా ఉంచడం కూడా ఆదేశించారు.
Chief Minister Revanth Reddy has issued special instructions to officials across Telangana in view of the Meteorological Department’s warning of heavy rainfall over the next two days. He asked all district collectors to remain on high alert and monitor the situation continuously.

The CM advised that people living in low-lying areas should be relocated in advance to safe locations and temporary relief centers should be set up. All causeways must be inspected, and areas prone to waterlogging on roads should be identified so that traffic can be controlled in advance to prevent accidents.

Electricity department officials were instructed to ensure uninterrupted power supply and remove dangling wires immediately to avoid any casualties.

Even during the Dasara holidays, educational institutions must remain vigilant. Citizens are advised to go out only if absolutely necessary during rainfall. CM Revanth Reddy also directed Hyderabad authorities, including GHMC, HYDRAA, HMWSSB, NDRF, and SDRF teams, to be on high alert and ready to take immediate action if needed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *