కూకట్ పల్లి : ఈ నెల 7వ తేదీన జరిగిన దొంగతనం కేసును కూకట్ పల్లి పోలీసులు ఛేదించారు. ఇంట్లో పని చేస్తూ దొంగతనానికి పాల్పడిన బంటి చంటి కుమార్(26) అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు. నిందితుడు వద్ద నుండి 7లక్షల రూపాయల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 33 కేసులో నిందితుడు గా ఉన్నట్లు కూకట్ పల్లి పోలీసులు గుర్తించారు. అన్నపూర్ణ హోమ్ కేర్ సర్వీస్ ద్వారా శైలజ అనే మహిళ ఇంట్లో నిందితుడు కేర్ టకేర్ గా వచ్చి దొంగతనానికి పాల్పడ్డాడు.