ఇటీవల జాతీయ అవార్డులు పొందిన తెలంగాణ గ్రామాలు, మండలాలు, జిల్లా పరిషత్ ల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఈ నెల 17న ఢల్లీి లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల విూదుగా తీసుకోవడానికి వెళుతున్న సందర్భంగా వారికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రావిూణాభివృద్ధి గ్రావిూణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం నాడు హైదారాబాద్ లోని మంత్రుల నివాసంలో అల్పాహార విందు ఇచ్చి సాగనంపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ములుగు జిల్లా చైర్మన్ కుసుమ జగదీశ్, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ప్రత్యేక కమిషనర్లు ప్రసాద్, ప్రదీప్ శెట్టి, అవార్డులు పొందిన గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీపీ లు, డీపీవో లు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఒకప్పుడు వరంగల్ జిల్లా గంగదేవి పల్లె ను చూసి గర్వపడే వాళ్ళం. అక్కడికీ అందరూ వెళ్ళి చుసే వాళ్ళం. ఇప్పుడు తెలంగాణలో అన్ని గంగదేవి పల్లె లు గా మారి దేశానికి ఆదర్శంగా మారాయి. సీఎం కెసిఆర్ ముందు చూపు వల్ల ఇవ్వాళ గ్రామాల రూపు రేఖలు మారిపోయినయి.
ఈ ఘనత మన ప్రజా ప్రతినిధులు, అధికారులకే చెందుతుంది. గతంలో గ్రామాలు అధ్వాన్నంగా ఉండేవి. ఈ రోజు గ్రామాల్లో అన్ని సదుపాయాలు పెరిగాయి. ట్రాక్టర్లు, ట్రాలీ లు, ట్యాంకర్లు వస్తాయని కూడా ఎవరూ ఊహించలేదు. అక్కడక్కడా నిర్లక్ష్యం వహించిన చోట్ల తప్ప అన్ని గ్రామాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 79 అవార్డులు వచ్చాయి. ఇంకా మనకు వస్తాయి. మనకు దరి దాపుల్లో మిగతా గ్రామాలు లేవు. ప్రధాని మోడీ, అమిత్ షా ల సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రానికి కూడా మనలాగా అవార్డులు రాలేదు. ఇదంతా కేవలం మన సీఎం కెసిఆర్ ముందు చూపు వల్లే సాధ్యం అయింది. ఇప్పటిదాకా కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేయాలి. ఆయా కార్యక్రమాలు కొనసాగించాలి. మరింత పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహించాలి. గ్రామాన్ని చూస్తే, అందంగా, ఆహ్లాద కరంగా ఉండేలా చూడాలి. కేంద్రం సహకరిస్తే, ఇంకా అభివృద్ధికి అవకాశం ఉండేది. మరికొన్ని ఇబ్బందులను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా సీఎం కెసిఆర్ చెప్పినట్లు, అసెంబ్లీ తీర్మానం చేసిన విధంగా ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుందని అన్నారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ అవార్డులు తీసుకోవడానికి ఢల్లీి కి వెళుతున్న సందర్భంగా ఇలా వారిని అభినందంచి పంపిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని, అవార్డులు పొందిన వాళ్ళను అభినందిస్తున్నాను. కేంద్రం జాతీయ అవార్డుల ప్రమాణాలను మించిన ప్రతిభ మన గ్రామాలు సాధించాయి. సీఎం కెసిఆర్ నేతృత్వం, మార్గ నిర్దేశం లి ఇవ్వాళ తెలంగాణ గ్రామాలు అద్భుతంగా తయారు అయ్యాయి. పురస్కారాలు సామాన్యంగా రావు. అందులో కేంద్రంలో లేని పార్టీ ప్రభుత్వాలు సాధించడం కష్టం. అలాంటిది కేంద్రం సహకరించకుండా రాష్ట్రంలో ఇన్ని గ్రామాలు అవార్డులు సాధించడం మామూలు విషయం కాదు. పిల్లల ల పట్ల మరింత శ్రద్ధ కనబరిచేలా మనం జాగ్రత్త పడాలి. గ్రామ పంచాయతీలు చైల్డ్ ఫ్రెండ్లీ గా మారాలి. ఇందుకోసం అధికారులు ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. సమాజంలో క్రైం రేట్ తగ్గింది. అనంతరం ప్రజా ప్రతినిధులు తరలి వెళుతున్న బస్సుకు మంత్రి తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సు ఢల్లీి బయల్దేరింది.