హైదరాబాద్ : డీజీపీ కార్యాలయంలో ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. డీజీపీ అంజనీ కుమార్, , అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీజీ లు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్, విజయ్ కుమార్, షికా గోయల్, సందీప్ శాండిల్య, రాచకొండ సీపీ డి.ఎస్.చౌహాన్, ఐ.జి లు కమలహాసన్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, షా నవాజ్ కాసీమ్, రాష్ట్రంలోని సీ.పి లు, ఎస్.పి లు హజరయ్యారు.