Awareness is key to fighting cybercrime: Students can play a major role, say Jagtial police officials..సైబర్ నేరాలపై

సైబర్ నేరాలపై అవగాహనే రక్షణ మార్గం: విద్యార్థుల్లో చైతన్యం అవసరం
Awareness is key to fighting cybercrime: Students can play a major role, say Jagtial police officials

సైబర్ నేరాలపై సమాజం పూర్తిగా అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని, విద్యార్థుల్లోని చైతన్యమే భవిష్యత్తులో ఈ నేరాల్ని నిరోధించగలదని జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ పేర్కొన్నారు.

Every individual must be aware of cybercrimes, and students’ awareness can play a crucial role in preventing them in the future, said Jagtial DSP (D4C) M. Venkataramana.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం కోరుట్లలోని PB గార్డెన్‌లో పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ వెంకటరమణ, మెట్‌పల్లి డీఎస్పీ రాములు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలపై మాసానికోసారి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవగాహన ఉంటే, వారి ద్వారా కుటుంబం మొత్తానికీ అవగాహన చేరుతుందని చెప్పారు.

As part of ongoing cybercrime control initiatives under the direction of SP Ashok Kumar, a cyber awareness session was held for students at PB Garden in Korutla. DSP Venkataramana, along with Metpally DSP Ramulu, stated that such awareness programs would be held monthly in schools and colleges.

విద్యార్థులకు OTP ఫ్రాడ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్ రిక్వెస్టుల పేరిట మోసాలు, బ్యాంక్ లోన్ స్కాంలు, అనధికార APK యాప్‌ల లింకులు వంటి అంశాలపై వివరాలు అందించారు. ఎస్సై చిరంజీవి, సైబర్ క్రైమ్ ఎస్సైలు కృష్ణ, దినేష్‌లు దీనిపై క్లుప్తంగా వివరించారు. స్క్రిప్ట్ రూపంలో అవగాహన ఇచ్చి, విద్యార్థుల మనసుల్లో ఈ సమాచారాన్ని ముద్రించారు.

The team explained in detail about OTP frauds, fake Instagram friend requests, bank loan scams, and malicious APK app links. SI Chiranjeevi, cybercrime SIs Krishna and Dinesh delivered their sessions in an engaging script-based format to help students grasp the content easily.

ఈ అవగాహన కార్యక్రమంలో కోరుట్ల ఎస్సై చిరంజీవి, ట్రస్మా పట్టణ అధ్యక్షుడు ఎం.ఎ.భారీ, ట్రైస్మా స్కూల్ యాజమాన్యం, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *