Dulquer Salmaan’s Pan-India Film #DQ41 Launched Grandly in Hyderabad; Regular Shoot Begins Today..దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్, నూతన దర్శకుడు రవి నేలకుదిటి కాంబినేషన్‌లో రూపొందుతున్న SLV సినిమాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #DQ41 హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. నాని ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

The pan-India film #DQ41, starring Dulquer Salmaan and directed by debutant Ravi Neelakudi, was launched grandly in Hyderabad under SLV Cinemas. Natural Star Nani gave the clap for the first shot, and the film’s regular shooting began today.

వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. తన 41వ సినిమాగా రూపొందుతున్న #DQ41 చిత్రానికి నూతన దర్శకుడు రవి నేలకుదిటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది SLV సినిమాస్ నిర్మాణ సంస్థకు 10వ చిత్రంగా నిలవనుంది (#SLV10).

ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు నాని క్లాప్ కొట్టగా, దర్శకుడు బుచ్చి బాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్‌ను గుణ్ణం సందీప్, నాని, రమ్య గుణ్ణం కలిసి టీంకు అందజేశారు. మొదటి షాట్‌ను దర్శకుడు రవి నేలకుదిటి స్వయంగా తెరకెక్కించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

లవ్ స్టోరీతో పాటు డీప్ హ్యుమన్ ఎమోషన్స్‌కు ప్రాధాన్యతనిచ్చే ఈ చిత్రం, భారీ స్థాయిలో హై టెక్నికల్, ప్రొడక్షన్ విలువలతో రూపొందనుంది. అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రాఫీ అందించగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది. నటీనటులు మరియు మిగతా టెక్నికల్ క్రూ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Versatile actor Dulquer Salmaan is all set to entertain audiences with yet another unique film. His 41st movie, titled #DQ41, is being directed by debutant Ravi Neelakudi and produced by Sudhakar Cherukuri under the SLV Cinemas banner. This marks the production house’s 10th venture, making it a milestone project tagged as #SLV10.

The film was launched today with a grand pooja ceremony in Hyderabad. Natural Star Nani gave the clap for the muhurtham shot, while director Buchi Babu Sana switched on the camera. The script was handed over to the team by Gunnam Sandeep, Nani, and Ramya Gunnam. Director Ravi Neelakudi himself directed the first shot. ‘Dasara’ and ‘The Paradise’ director Srikanth Odela also attended the launch.

This pan-India film promises to blend an emotional love story with a deep human drama and is being mounted with high technical and production values. Cinematography is being handled by Anay Om Goswami, music is composed by G.V. Prakash Kumar, and production design is by Avinash Kolla.

#DQ41 will be released in Telugu, Malayalam, Hindi, Tamil, and Kannada languages. Further details about the cast and crew will be announced by the makers soon.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *