యాదాద్రి నరసింహుడికి ఒక భక్తుడు బంగారు కిరీటాలు బహుకరించాడు. హైదరాబాద్ లోని చంపాపేట్ కు చెందిన మాచమోని టీవీప్రకాష్ ముదిరాజ్ సుమారు రూ. 30 లక్షల విలువచేసే అరకేజీ బంగారం, అరకేజీ వెండితో మూడు కిరీటాలు, ప్లేట్లు స్వామి వారికి బహూకరించారు. ఇందుకు సంబంధించిన కిరీటాలను ఆలయ ఈవో గీతకు అందజేశారు.