
ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బిఆర్ఎస్ నేత కెసిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తేలితే ఉప ఎన్నికలు తప్పవని ఆయన అంచనా.
BRS chief KCR has reportedly urged party cadres to gear up for upcoming by-elections, expecting disqualification of defected MLAs and fresh polls in their constituencies.
తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఇటీవల ఇతర పార్టీలకు చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ సహా 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగొచ్చని, అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా కేసీఆర్ మరో కీలక అంశాన్ని – బనకచర్ల ప్రాజెక్టును – ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రాంతానికి నష్టం జరిగే అవకాశం ఉన్నందున దాన్ని అడ్డుకునేందుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు తెలిసింది. ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలంటూ పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. అలాగే ఈ అంశంపై భవిష్యత్తు కార్యాచరణను కూడా నేతలతో చర్చించినట్లు సమాచారం.
రాబోయే ఉప ఎన్నికలను పార్టీకి అనుకూలంగా మలచుకోవాలన్నదే కెసిఆర్ వ్యూహం. అనర్హత పడిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో తిరిగి ఎన్నికలు తప్పవని, ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ స్థాయిలో వ్యూహాలు సిద్ధం చేయాలని ఆయన కోరినట్లు సమాచారం. బనకచర్ల ప్రాజెక్టుపై ఉద్యమం, ఉప ఎన్నికల వ్యూహం కలిపి తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపునకు దారి తీసే అవకాశముందని విశ్లేషకుల అంచనా.
BRS chief KCR has reportedly urged party leaders and cadres to be ready for upcoming by-elections, anticipating disqualification of defected MLAs and fresh elections in their constituencies.
Politics in Telangana is heating up. Following the Supreme Court’s direction to the Speaker to decide on the disqualification of 10 MLAs who switched parties within three months, KCR held a key meeting with senior BRS leaders. During this internal meeting, he is said to have expressed confidence that by-elections will definitely take place in at least 11 constituencies, including Jubilee Hills, and instructed the party ranks to prepare accordingly.
Along with poll readiness, KCR also reportedly raised the issue of the Banakacharla Project. He is believed to have called for a movement to oppose the project, arguing that it could cause damage to the region. KCR instructed party workers to create awareness among the public about the details of the project and its potential impact. Future strategies on this issue were also discussed in the meeting.
KCR’s strategy revolves around turning these upcoming by-elections to the BRS party’s advantage. He firmly believes that the disqualification of defected MLAs will trigger re-elections in their constituencies, and the party must prepare tailored political strategies accordingly. Political observers believe that this dual approach — gearing up for elections and launching protests against the Banakacharla project — could significantly reshape Telangana’s political landscape.