DOST Special Phase Registration Deadline Extended Till August 2..దోస్త్ స్పెషల్

Image: Screenshot from ‘ https://www.google.com/                ” (used under fair use for reporting)

దోస్త్ స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లకు గడువు పొడిగింపు – ఆగస్ట్ 2 వరకు అవకాశం | DOST Special Phase Registration Deadline Extended Till August 2

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. జూలై 31తో ముగియాల్సిన గడువును ఇప్పుడు ఆగస్ట్ 2వ తేదీ వరకు కొనసాగించారు.

The Telangana State Council of Higher Education (TSCHE) has extended the registration deadline for the Special Phase of DOST 2025 admissions. Students now have time until August 2 to register online for vacant degree college seats.


తెలంగాణలో డిగ్రీ కళాశాలల ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు దోస్త్ (DOST) ద్వారా admissions ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ముగిసిన మూడు విడతల తర్వాత, మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి అధికారులు స్పెషల్ ఫేజ్‌ను ప్రకటించారు. ముందుగా ఈ స్పెషల్ ఫేజ్‌కు రిజిస్ట్రేషన్ గడువును జూలై 31గా నిర్ణయించగా, తాజాగా దానిని ఆగస్ట్ 2 వరకు పొడిగించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది.

అభ్యర్థులు https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఆగస్ట్ 6న సీట్ల కేటాయింపు జరగనుందని అధికారులు తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్పాట్ అడ్మిషన్లలో సీటు పొందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్ లభించదని అధికారులు స్పష్టం చేశారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా:

  • దోస్త్ అధికార వెబ్‌సైట్‌కి వెళ్లాలి (https://dost.cgg.gov.in)
  • హోం పేజ్‌లో ‘Candidate Registration’ క్లిక్ చేయాలి
  • ఫీజు చెల్లించిన తర్వాత, ఇంటర్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేది, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి
  • ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా అథెంటికేషన్ పూర్తి చేయాలి
  • దోస్త్ ఐడీ రూపొందుతుంది – దానితో లాగిన్ అవ్వాలి
  • వెబ్ ఆప్షన్లు ఎంచుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

DOST 2025 Special Phase: Final Registration Deadline Extended to August 2 — Seat Allotment on August 6

Good news for students applying through DOST 2025 in Telangana. The deadline for the Special Phase registration has been extended once again. The official announcement was released confirming the new dates.

Admissions under the Degree Online Services, Telangana (DOST) are still underway. While the admission process for the first three phases has already been completed, the special phase was announced to fill the remaining vacant seats. Initially, the last date for registration was set as July 31. However, authorities have now extended it to August 2.

As per the revised schedule, candidates can now register until tomorrow, August 2. Seat allotment for the special phase will be announced on August 6, officials said. Students participating in this special phase counseling must pay a registration fee of ₹400. However, those who take admission under spot admissions will not be eligible for scholarships.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *