
ఇరగంరెడ్డి కుమార్తె పెళ్లికి జగన్ రెడ్డి ని ఆహ్వానించిన వైసీపీ నేత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, బ్రహ్మంగారిమఠం మండల కన్వీనర్ ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి తన కుమార్తె వివాహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ని ఆహ్వానించారు.
మంగళవారం శంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 3న తన కుమార్తె ఐశ్వర్య–అల్లుడు అమ్మిరెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి ల వివాహం జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం తాడేపల్లిలోని జగన్ రెడ్డి కార్యాలయంలో ఆయనను కలసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారని చెప్పారు.
పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తానని జగన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు శంకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు అమ్మిరెడ్డి నాగేంద్ర ప్రసాద్ రెడ్డి, ఇరగంరెడ్డి నరసింహారెడ్డి, అమ్మిరెడ్డి రమణారెడ్డి (చిన్నా) తదితరులు పాల్గొన్నారు.
YCP Leader Iragamreddy Shankar Reddy Invites YS Jagan to Daughter’s Wedding
YSR Congress Party leader and Brahmangarimatham mandal convener Iragamreddy Shankar Reddy invited former YSRCP chief YS Jagan Mohan Reddy to attend the wedding of his daughter.
Speaking to the media on Tuesday, Shankar Reddy stated that the wedding of his daughter Aishwarya and son-in-law Ammireddy Uday Kumar Reddy is scheduled for the 3rd of this month. On Monday, he met YS Jagan Mohan Reddy at his Tadepalli office and personally handed over the wedding invitation.
Shankar Reddy mentioned that Jagan assured him he would definitely attend the wedding and bless the newlyweds. YSRCP leaders Ammireddy Nagendra Prasad Reddy, Iragamreddy Narasimha Reddy, and Ammireddy Ramana Reddy (Chinna) were also present during the meeting.