భువనేశ్వర్ : ఒరిస్సా మండుతున్న ఎండలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భువనేశ్వర్ నగరంలో 40 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదైంది. బారిపద నగరంలో ఉష్ణోగ్రత 41.6 డిగ్రీల సెల్షియస్, జార్సుగూడలో 41.5 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మండుతున్న ఎండలకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి.దీంతో ఒరిస్సా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఐదు రోజుల పాటు సెలవు ప్రకటించారు.