క్యాంటీన్ టెండర్ రద్దు చేయాలని యాదగిరిగుట్ట బీజేపీ డిమాండ్ చేస్తూ, ఆలయ వ్యవహారాల్లో గోల్‌మాల్ జరుగుతోందని ఆరోపించింది. BJP in Yadagirigutta has demanded the cancellation of the Indira Mahila Shakti canteen tender at Sri Lakshmi Narasimha Swamy temple, citing irregularities.

యాదగిరిగుట్ట, జూలై 26: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్’ పేరుతో ఆహ్వానించిన షాపు టెండర్లను వెంటనే రద్దు చేయాలని పట్టణ బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వినతిపత్రాన్ని దేవస్థానం ఇఓ భాస్కర్ శర్మకు సమర్పించామని పట్టణ బీజేపీ అధ్యక్షుడు తెలిపారు. దేవస్థానం కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేదిక కాదని హెచ్చరించారు. ఇటీవల శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమల టెండర్లలో కూడా గోల్‌మాల్ జరిగిందని, తేదీ–సమయాలు స్పష్టంగా లేకుండా టెండర్ ఆహ్వానించి, తిరిగి రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సంబంధిత విభాగం అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినప్పటికీ నెలలు గడుస్తున్నా దేవస్థానం స్పందించలేదని విమర్శించారు.

కొండపైని పి.ఆర్.ఓ వ్యవస్థ దర్శనాల దందాగా మారిందని దానిని కూడా రద్దు చేయాలని కర్రె ప్రవీణ్ అన్నారు. సుదూర ప్రాంతాల నుండి యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతించాలని కోరారు. పాతగుట్టలోని అనుబంధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రచించి అమలు చేయాలని, భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు, వసతి గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. పాతగుట్టలో దేవుని నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నాయని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. డిమాండ్లపై తక్షణ చర్యలు తీసుకోకపోతే భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రవీణ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీనివాస్‌తో పాటు పట్టణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Yadagirigutta, July 26: The local BJP unit has demanded the cancellation of shop tenders issued under the name of the “Indira Mahila Shakti Canteen” at Sri Lakshmi Narasimha Swamy temple. Town BJP leaders submitted a petition to temple EO Bhaskar Sharma, stating that the temple should not be turned into a political platform for Congress. They alleged irregularities in recent tenders related to Sri Satyanarayana Swamy idols, pointing out that tenders were invited without proper date and time, and later cancelled. They demanded action against officials involved, accusing the temple authorities of ignoring their repeated requests.

BJP leader Karre Praveen demanded the cancellation of the temple’s PRO system, calling it a “darshan business.” He urged the authorities to allow two-wheelers of devotees to reach the hilltop and sought a development plan for the old temple (Patagutta), including basic amenities and guest houses for devotees. He expressed concern over the families living near the old temple who are struggling due to lack of business. He warned of large-scale protests if their demands are not met. State BJP Council member Racha Srinivas and other local BJP leaders were present.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *