
సూపర్ హీరో తేజ సజ్జా నటించిన పాన్-ఇండియా సినిమా మిరాయ్ నుండి ‘వైబ్ ఉంది’ ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో విడుదలై సంచలనం సృష్టించింది.
హనుమాన్ చిత్ర విజయంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన సూపర్ హీరో తేజ సజ్జా, ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ మిరాయ్లో సూపర్ యోధుడిగా ప్రేక్షకులను అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు గ్లింప్స్, టీజర్ అద్భుతమైన స్పందన తెచ్చాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ వైబ్ ఉంది ప్రోమో ముందే సంచలనం రేపగా, పూర్తి లిరికల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శక్తివంతమైన కంపోజిషన్, హై ఎనర్జీ మ్యూజిక్‌తో పాట అదరగొడుతోంది.
కృష్ణకాంత్ రాసిన లిరిక్స్‌లో తెలుగు, ఇంగ్లీష్ మేళవింపు హీరో ఎమోషన్, హీరోయిన్ అందాన్ని హైలైట్ చేస్తోంది. అర్మాన్ మాలిక్ వోకల్స్ సాఫ్ట్ నుంచి హై బీట్ వరకూ మాయ చేస్తుంటే, తేజ సజ్జా ఎనర్జీ, డాన్స్ స్టెప్స్, ఛార్మ్ మెస్మరైజ్ చేస్తున్నాయి. రితికా నాయక్ గ్లామరస్ లుక్స్, డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. అర్బన్ సెట్, స్టైలిష్ లైటింగ్, విజువల్స్ సాంగ్‌ని నెక్స్ట్ లెవల్‌లోకి తీసుకెళ్తున్నాయి. మాస్ & క్లాస్‌ను కలిపే ట్రెండీ వైబ్ ఈ పాటను మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్‌లో నిలిపేలా చేస్తోంది.
ఈ చిత్రంలో మనోజ్ మంచు పవర్‌ఫుల్ విలన్‌గా, శ్రియ శరణ్, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే బాధ్యతలు కూడా చేపట్టగా, మణిబాబు కరణం రచన, సంభాషణలు అందించారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2D, 3D ఫార్మాట్లలో 8 భాషల్లో విడుదల కానుంది.
Superhero Teja Sajja, who gained nationwide fame with the success of Hanuman, is back with the much-awaited pan-India film Mirai, directed by Karthik Ghattamneni. Produced by TG Vishwa Prasad and K. Niranjan under People Media Factory, the film’s first single, Vibe Undi, has been officially released. The promo had already created waves, and now the full lyrical video is captivating audiences with its high-octane energy, powerful composition, and trendy vibe.
The song blends Telugu and English lyrics by Krishna Kanth, highlighting Teja’s energy and Ritika Nayak’s charm. Armaan Malik’s magical vocals elevate the track, seamlessly switching from soft tones to high beats. The choreography, urban settings, lighting, and stylish visuals take the song to the next level, while Teja-Ritika’s dance chemistry and glam factor stand out. With trendy touches and hints of classical style, Vibe Undi is set to dominate music charts.
The film features Manchu Manoj in a powerful villain role, along with Shriya Saran, Jayaram, and Jagapathi Babu in key roles. Directed and shot by Karthik Ghattamneni, Mirai is also scripted by him with dialogues by Manibabu Karanam. The film is set for a grand worldwide release on September 5 in 2D and 3D formats across 8 languages.