
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మైదుకూరు చాపాడు మండలంలోని నక్కలదిన్నె పిహెచ్‌సి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించగా, విద్యార్థులు మలేరియా-డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.
మైదుకూరు
చాపాడు మండలంలోని నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చిన్న గురువలూరు సచివాలయం పరిధిలో చిన్న గురువలూరు ప్రభుత్వ బాలుర సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ కావ్య మాధురి, వార్డెన్ పి. నాగకుమార్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కావ్య మాధురి మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు పరీక్షలు, చికిత్సలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు జరిపి, మందులు కూడా అందజేశారు.
డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం (జూలై 1–31) సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి వ్యక్తిగత మరియు పరిసర పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఆరోగ్య విస్తరణ అధికారి ఎం. రాఘవయ్య, సూపర్వైజర్ టి. ప్రసాద్, ఎం.ఎల్.హెచ్.పి. శివమ్మ, ఏ.ఎన్.ఎం. యు. చంద్రకళ, ఆశా కార్యకర్తలు వెంకట సుబ్బమ్మ, గంగాదేవి, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
In Chinnaguruvuluru village of Chapadu mandal, a medical camp was organized for government boys’ hostel students under the supervision of Dr Kavya Madhuri, Medical Officer of Nakkaladinne PHC, and hostel warden P. Nagakumar. Students were screened for malaria and dengue, and free medicines were provided.
Dr Kavya Madhuri emphasized that seasonal changes increase the risk of infectious diseases and urged students to undergo preventive medical check-ups. As part of the Anti-Dengue Month (July 1–31), a rally was conducted to raise awareness about personal and environmental hygiene. Health extension officer M. Raghavayya, supervisor T. Prasad, MLHP Shivamma, ANM U. Chandrakala, ASHA workers Venkata Subbamma and Gangadevi, and students took part in the program.