
లక్కేపూర్, తోట గోపయ్యపల్లిలో స్వర్గీయ తోట కొమురయ్య జ్ఞాపకార్థం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది; nearly 200 villagers availed free BP, sugar, ECG and eye tests along with free medicines.
మంథని
మంథని మండలం లక్కేపూర్, తోట గోపయ్యపల్లి గ్రామాల్లో శనివారం స్వర్గీయ తోట కొమురయ్య స్మారకార్థం మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని తోట లక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మంథని పటేల్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో కరీంనగర్ సన్‌రైజ్ ఆసుపత్రి వైద్యులు పాల్గొని సేవలు అందించారు. బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను కూడా పంపిణీ చేశారు. దాదాపు 200 మంది ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. డాక్టర్ రమణి, క్యాబ్ మేనేజర్ రాజేందర్, కోఆర్డినేటర్ సతీష్, మార్కెటింగ్ తిరుపతి, పటేల్ ఐ కేర్ వ్యవస్థాపకుడు బుద్ధర్తి సతీష్ కుమార్, తోట కొమురయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
A mega free medical camp held in memory of Thota Komuraiah at Lakkepur and Thota Gopayyapalli in Manthani mandal drew a huge response, with around 200 people availing free BP, sugar, ECG and eye tests, along with free medicines. The camp was inaugurated by Thota Lakshmi. Doctors from Karimnagar Sunrise Hospital, in association with Manthani Patel Eye Care Hospital, extended medical services. Dr Ramani, CAB Manager Rajender, Coordinator Satish, Marketing Tirupati, Patel Eye Care founder Buddharthi Satish Kumar, members of the Komuraiah family and others participated.