
రాజకీయ కక్షలు, తప్పుడు ఆరోపణలతో ప్రజల సమస్యలను మర్చిపోవడం మంచిది కాదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హెచ్చరించారు. కేవలం 14 నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత టిడిపిదేనని ఆయన విమర్శించారు.
Political vendettas and diversion tactics are not the way forward, warned Kadapa MP YS Avinash Reddy, stating that TDP holds the dubious record of borrowing ₹2 lakh crore within 14 months.
మైదుకూరు
మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం ఇడమడక గ్రామంలో వైసీపీ నాయకుడు శ్రీకాంత్ బావ వీరభద్రుడు డాబా కూల్చివేతపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ శెట్టిపల్లి రఘురాం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ఆదేశాలతో రాజకీయ కక్షసాధనగా రెవెన్యూ, పోలీసు సిబ్బంది చర్యలు తీసుకోవడం తగదని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే రెడ్‌బుక్ రాజకీయాలు చేయడం మంచిదికాదని హెచ్చరించారు.
ప్రస్తుత ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో విఫలమైందని, పెన్షన్‌లు కోతకు గురయ్యాయని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి పర్యటనలు, పబ్లిసిటీ ఖర్చులు ప్రజా డబ్బును వృధా చేస్తున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో అప్పులు పెరిగితే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పిన టిడిపి నాయకులు, ఇప్పుడు 14 నెలల్లోనే రెండు లక్షల కోట్లు అప్పు చేసిన విషయంపై మౌనం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు.
మద్యం ఆదాయం, బెల్ట్‌షాపుల పెరుగుదల వంటి అంశాలపై కూడా టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను గుర్తుచేశారు. వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు, అరెస్టులు చేసి పార్టీని నిర్వీర్యం చేయాలని కుట్ర జరుగుతోందని అన్నారు. ప్రజలు సమయానికి సమాధానం ఇస్తారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్డి వెంకటసుబ్బారెడ్డి, సీనియర్ నేత ఇరగం రెడ్డి తిరుపాల్రెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
Political vendettas and misleading tactics will not help address public issues, said Kadapa MP YS Avinash Reddy. He accused the TDP of creating a record by borrowing ₹2 lakh crore within just 14 months.
In Maidukuru constituency’s Iddamadaka village of Duvvur mandal, Avinash Reddy, along with YSRCP State Disciplinary Committee Chairman Shettipalli Raghurama Reddy, expressed anger over the demolition of a structure belonging to YSRCP leader Srikant Bava Veerabhadrudu. They alleged that local MLA Sudhakar Yadav ordered the demolition using revenue and police officials as part of political revenge. Avinash Reddy warned that engaging in such “Red Book politics” instead of solving public issues is not a healthy practice.
He further criticized the current government for failing to implement the promised Super Six schemes, cutting pensions, and spending public funds on unnecessary publicity. He recalled how TDP leaders once claimed that borrowing ₹3 lakh crore would turn Andhra Pradesh into another Sri Lanka, but now the party itself has borrowed ₹2 lakh crore in just 14 months without fulfilling welfare commitments.
Avinash Reddy also alleged that TDP’s tenure saw 43,000 belt liquor shops, and even today, income from liquor sales is increasing. He said the TDP is attempting to weaken YSRCP by falsely implicating its leaders in scams and conducting unjust arrests. He warned that the public will give a strong response when the time comes. YSRCP State Secretary Reddy Venkata Subba Reddy, senior leader Iragam Reddy Tirupala Reddy, and other local leaders participated in the meeting.