
చౌటుప్పల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీఎస్పీ చక్రధర్ రావు, మరో డీఎస్పీ శాంతా రావు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన అధికారి ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉంది.
Two Andhra Pradesh DSPs, Chakradhar Rao and Shanta Rao, died in a tragic road accident at Choutuppal, while officer Prasad was critically injured.
నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా వచ్చిన లారీకి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో చక్రధర్ రావు, శాంతా రావు అక్కడికక్కడే మృతి చెందగా, ప్రసాద్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
The accident occurred around midnight when the car carrying the DSPs lost control, hit the divider, and collided with an oncoming lorry. Chakradhar Rao and Shanta Rao died on the spot, while Prasad was rushed to a hospital in critical condition. Police have registered a case and are investigating.
ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వర్తిస్తున్న పోలీసుల మరణం బాధాకరమని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించనున్నామని ప్రకటించారు.
Home Minister Anitha expressed shock over the incident, terming the deaths of officers on duty as unfortunate and assured the best medical care for the injured.