Telangana Congress leaders held a key meeting on implementing 42% reservations for BCs and the roadmap ahead.

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, భవిష్యత్ కార్యాచరణపై కాంగ్రెస్ అగ్రనేతల కీలక సమావేశం జరిగింది.
Telangana Congress leaders held a key meeting on implementing 42% reservations for BCs and the roadmap ahead.

హైదరాబాద్:
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రిజర్వేషన్ల భవిష్యత్ కార్యాచరణపై సమావేశమయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కుల గణన సర్వే ఆధారంగా స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో చట్టం ఆమోదించింది. ఈ బిల్లు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపబడింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కేబినెట్ తీర్మానం అనంతరం గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ కూడా పంపబడింది.

ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడు కంచె ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
Hyderabad:
A high-level meeting was held between Telangana Congress leaders, AICC President Mallikarjun Kharge, and senior Congress leader Rahul Gandhi to discuss the roadmap for 42% BC reservations. Recently, the Telangana government passed a bill in the Assembly increasing BC reservations to 42% in local bodies, education, and employment based on the caste census data. The bill has been sent by the Governor to the President. Furthermore, an ordinance to implement 42% BC reservations in local body elections has been forwarded to the Governor following a cabinet resolution.

In this context, Telangana Congress leaders discussed future strategies in detail. The meeting was attended by CM Revanth Reddy, Deputy CM Bhatti Vikramarka, PCC Chief Mahesh Kumar Goud, AICC in-charge Meenakshi Natarajan, Ministers Ponnam Prabhakar, Konda Surekha, Vakiti Srihari, Uttam Kumar Reddy, and expert committee member Kancha Ilaiah, among others.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *