This launch has boosted the buzz around the film ‘Thank You Dear’ starring Dhanush Raghumudri and Hebbah Patel…చిత్రంలోని తొలి పాట ‘

చిత్రంలోని తొలి పాట ‘చిక్కక చిక్కిన గుమ్మ’ను మంచు మనోజ్ విడుదల చేయడం థాంక్యూ డియర్ చిత్రబృందానికి ఉత్సాహాన్నిచ్చింది. This launch has boosted the buzz around the film ‘Thank You Dear’ starring Dhanush Raghumudri and Hebbah Patel.

పప్పు బాలాజీ రెడ్డి నిర్మాణంలో, తోట శ్రీకాంత్ కుమార్ రచన-దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థాంక్యూ డియర్’ సినిమా వేగంగా పూర్తవుతోంది. మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా, వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్, బలగం సుజాత, సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు నటిస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్ర టీజర్‌ను వివి వినాయక్ విడుదల చేయగా, ఇప్పుడు ‘చిక్కక చిక్కిన గుమ్మ’ అనే తొలి పాటను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ లాంచ్ చేశారు. ఈ పాటకు బాలాజీ రెడ్డి సాహిత్యం అందించగా, శ్రీచరణ్ గానం చేశారు. సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించగా, పి ఎల్ కె రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.

ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ, “ధనుష్ రఘుముద్రికి ఆల్ ద బెస్ట్. చిత్రబృందం మొత్తానికి నా శుభాకాంక్షలు. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ, “మనోజ్ గారు పాటను విడుదల చేయడం సంతోషాన్ని ఇచ్చింది. ఆయనకు ధన్యవాదాలు” అన్నారు. నిర్మాత బాలాజీ రెడ్డి, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, లైన్ ప్రొడ్యూసర్ పునీత్ కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటూ సినిమా విజయం సాధించాలని ఆశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *