కిట్టీ పార్టీ ఆంటీలా వ్యవహరిస్తున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ ఘాటు విమర్శలు గుప్పించారు. ఆధారాలేమీ లేకుండానే చిట్‌చాట్ పేరుతో బురద జల్లే రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.CM Revanth Reddy is acting like a “kitty party aunty” instead of behaving like a Chief Minister, alleged BRS working president KTR, slamming him for making baseless remarks without evidence.

కిట్టీ పార్టీ ఆంటీలా వ్యవహరిస్తున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ ఘాటు విమర్శలు గుప్పించారు. ఆధారాలేమీ లేకుండానే చిట్‌చాట్ పేరుతో బురద జల్లే రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.
CM Revanth Reddy is acting like a “kitty party aunty” instead of behaving like a Chief Minister, alleged BRS working president KTR, slamming him for making baseless remarks without evidence.

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శ‌లు చేశారు. ఖ‌మ్మం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ, ‘‘ముఖ్య‌మంత్రి లాగా కాకుండా, జూబ్లీహిల్స్ కిట్టీ పార్టీ ఆంటీలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు’’ అంటూ ఎద్దేవా చేశారు.
సోషల్ మీడియా రూమర్లకు బానిస అయిన రేవంత్, ఎవరో ఎక్కడో చెప్పిన మాటలను నమ్మి దానిపై చిట్‌చాట్‌ల పేరిట పబ్లిక్‌ స్టేట్మెంట్లు ఇస్తున్నాడని ధ్వజమెత్తారు. ‘‘ఇలా చిల్లర మాటలు మాట్లాడే విధానం దారుణం. దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలి. సీఎం, హోం మంత్రి పదవులు నీకే ఉన్నాయి. ఓ దొంగలా చీకట్లో కూర్చొని వదులు మాటలు మాట్లాడవద్దు’’ అని హెచ్చరించారు.

శవాల మీద పేలాలు ఏరుకునే వ్యవహారం అసహ్యకరమని విమర్శించారు. ‘‘ఎవరో దుబాయ్‌లో చనిపోతే దాన్ని నాతో లింక్ చేస్తావా? దానికి ఆధారం ఉందా? జ్ఞానం ఉందా నీకు?’’ అంటూ ప్రశ్నించారు. ‘‘మీడియా మేనేజ్‌మెంట్‌ చేసి ఎక్కువ రోజులు బతకలేవు. కిట్టీ పార్టీ ఆంటీలా వ్యవహరించకు’’ అని రేవంత్‌కు కేటీఆర్ సూచించారు.

‘‘నా మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నేను గతంలో కోర్టుకు వెళ్లాను. కోర్టు ‘చెత్తగా మాట్లాడితే చెంపతీసి కొడతాం’ అని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని స్టే అంటున్నాడు. ఇంజ‌క్ష‌న్ ఆర్డ‌ర్‌, స్టే కీ తేడా తెలియని మూర్ఖుడు నువ్వు’’ అని తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *