Former CM Chandrababu Naidu ignored Rayalaseema for years, failing to initiate or complete any major irrigation project, alleged YSRCP leaders in Kurnool.

రాయలసీమను ద్రోహించిన చంద్రబాబు… irrigation ప్రాజెక్టులపై శ్రద్ధ లేకపోయిన మాజీ సీఎం పై వైఎస్సార్‌సీపీ విమర్శ
Former CM Chandrababu Naidu ignored Rayalaseema for years, failing to initiate or complete any major irrigation project, alleged YSRCP leaders in Kurnool.
రాయలసీమ రైతులకు సాగునీరు అందించాల్సిన బాధ్యతను తీసుకోకుండా, కాలయాపన రాజకీయాలతో రైతుల ఆశలు చిదిమేశాడని మాజీ సీఎం చంద్రబాబు పై వైఎస్సార్‌సీపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిలో ఆయన పాత్ర శూన్యమని అన్నారు. 1998లో హంద్రీనీవా ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా మార్చేందుకు జీవో జారీ చేసి దాని సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు.
చంద్రబాబు పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తికాలేదని, తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరునగరి లాంటి ప్రాజెక్టులను పేరుపెట్టి వదిలేశారని ఆరోపించారు. రైతులను ఉచిత కరెంట్ దండగ అంటూ అవమానించారని, వ్యవసాయం పట్ల అవగాహన లేకుండా వ్యతిరేకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాకే హంద్రీనీవా, గాలేరునగరి ప్రాజెక్టులు వేగంగా ముందుకు వెళ్లాయని చెప్పారు.
వైయస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ డ్రౌట్ మిటిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 33 ప్రాజెక్టులకు రూ.40 వేల కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వైయస్ జగన్ ప్రారంభించారని, కుప్పానికి నీటిని పంపించిన ఘనత ఆయనదేనని వివరించారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును కూడా వ్యతిరేకించి, కమీషన్లకే పట్టం కట్టారని విమర్శించారు. హైకోర్టు, లా యూనివర్సిటీలను కర్నూల్ నుంచి తరలించిన బాబు, సీమకు న్యాయం చేసినట్టు చెప్పడం అబద్ధమని చెప్పారు.