
ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన పోలీసు సేవలు అందించాలనే దిశగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచనలు చేశారు. మల్లాపూర్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
District SP Ashok Kumar emphasized that police services should be made more accessible and efficient for the public, during his annual inspection at Mallapur Police Station.
జగిత్యాల జిల్లా, కోరుట్ల:
జిల్లాలోని మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన వార్షిక తనిఖీ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పలు కీలక సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా, వేగవంతమైన న్యాయం కల్పించేలా పోలీసులు పనిచేయాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించిన ఆయన, పలు కేసుల వివరాలు తెలుసుకుని స్టేషన్ రికార్డుల తనిఖీ చేపట్టారు.
పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుత దర్యాప్తు కేసులపై అధికారులతో సమీక్ష నిర్వహించి, అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. నేరాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని సూచిస్తూ, విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి పెట్టాలని సూచించారు. స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో తరుచుగా పర్యటించాలని, ప్రజలతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని అన్నారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది పకడ్బందిగా ఉండాలని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతిభద్రతల అంశాలపై ముందుగానే సమాచారాన్ని సేకరించి, సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
సైబర్ నేరాల నివారణపై యువతలో అవగాహన కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశంలో మాట్లాడుతూ, శుభ్రత పాటించాలి, క్రమశిక్షణతో విధులను నిర్వహించాలని సూచించారు. నూతన టెక్నాలజీపై సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. సిబ్బందిలో ఎవరికైనా సమస్యలుంటే చెప్పాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎస్పీ రాములు, మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్, మల్లాపూర్ ఎస్‌ఐ రాజు, ఎస్‌ఐలు అనిల్, చిరంజీవి, రాజు నాయక్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.