‘Nuvvunte Chaale’ First Single from Ram Pothineni’s Andhra King emerges as the romantic song of the year with poetic lyrics and soulful vocals by Anirudh

నువ్వుంటే చాలే ఫస్ట్ సింగిల్ హిట్: రామ్ పోతినేని లిరిక్స్, అనిరుధ్ వోకల్స్ మ్యూజిక్ మ్యాజిక్‌కి కొత్త నిర్వచనం ఇచ్చిన ‘ఆంధ్రా కింగ్’ రొమాంటిక్ ట్రాక్
‘Nuvvunte Chaale’ First Single from Ram Pothineni’s Andhra King emerges as the romantic song of the year with poetic lyrics and soulful vocals by Anirudh
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న ఆంధ్రా కింగ్ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలే’ యూత్ మన్నెత్తుకునే లవ్ సాంగ్‌గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్ & మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన లిరికల్ వీడియో అద్భుతమైన స్పందన తెచ్చుకుంది.
‘నువ్వుంటే చాలే’ పాటకు రామ్ పోతినేని తొలిసారిగా లిరిక్స్ రాశారు. ప్రేమను పదాల్లో నిర్వచించేందుకు ప్రయత్నించిన ఈ పాట ప్రతి ఒక్క పదం కవిత్వంలా భావోద్వేగాలను వ్యక్తపరిచింది. అనిరుధ్ రవిచందర్ మాయాజాలం వంటి వోకల్స్, ఆకట్టుకునే మ్యూజికల్ కంపోజిషన్, అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్, అసాధారణంగా మిళితమైన కోరస్ వోకల్స్ పాటను స్పెషల్‌గా తీర్చిదిద్దాయి. హుక్ లైన్ మెమరబుల్‌గా మారింది. ప్రతి ఫ్రేమ్ కూడా విజువల్ పెయింటింగ్‌లా కనిపించడంతో పాట అందాన్ని రెట్టింపు చేసింది.
రామ్-భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ, సహజత, ఎలిగెన్స్ ఈ పాటకు ప్రాణం పోశాయి. ప్రేమ భావాన్ని సున్నితంగా అద్భుతంగా ప్రతిబింబించేలా ఈ ట్రాక్ రూపొందింది. ప్రేమ అనుభూతిని మెరిసిపోయే రీతిలో చూపిస్తూ ‘నువ్వుంటే చాలే’ పాట ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన రొమాంటిక్ సాంగ్‌గా నిలిచే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ సిద్ధార్థ నుని, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా చేస్తున్నారు. ఆంధ్రా కింగ్ మ్యూజికల్ ప్రమోషన్స్ ఈ పాటతోనే బ్లాక్ బస్టర్ ప్రారంభాన్ని అందుకున్నాయి.