
హుస్నాబాద్‌లో మార్నింగ్ వాక్ చేసిన మంత్రి పొన్నం, ప్లాస్టిక్‌కు ‘నో’ అన్నారు
Minister Ponnam joins morning walk in Husnabad, promotes plastic-free living
హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానికులతో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని పిలుపునిస్తూ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Minister Ponnam Prabhakar took part in a morning walk with the public in Husnabad town and emphasized reducing plastic usage during a civic awareness program.
సిద్దిపేట:
హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని ప్రజలతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత శాఖాధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
పట్టణంలోని ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ముఖ్యంగా వివాహాలు, శుభకార్యాల్లో స్టీల్ ప్లేట్లు, గ్లాసుల వాడకాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ఇప్పటికే గ్రామాల వద్ద స్టీల్ బ్యాంక్‌లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
పరిసరాల సుందరీకరణలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని ఆరేపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన త్రిశూలం వాటర్ ఫౌంటెన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై అధికారులను ప్రశ్నించారు.