కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కేటీఆర్ డ్రగ్స్ కేసుపై విచారణ కొనసాగుతుంది: సీఎం రేవంత్..KCR must attend the Assembly; KTR drug case under investigation, says CM Revanth

కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కేటీఆర్ డ్రగ్స్ కేసుపై విచారణ కొనసాగుతుంది: సీఎం రేవంత్
KCR must attend the Assembly; KTR drug case under investigation, says CM Revanth

దిల్లీలో ఓ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతోందని, దోషులను చివరికి అరెస్ట్ చేస్తామన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

During a media interaction in Delhi, Telangana CM Revanth Reddy made strong statements about ongoing investigations into the previous government’s corruption. He stressed that KCR must attend the Assembly and asserted that arrests would happen, just like villains are caught in the climax.

“విలన్లు క్లైమాక్స్‌లోనే అరెస్ట్ అవుతారు,” అని వ్యాఖ్యానించిన రేవంత్, “గత పాలనలో జరిగిన అవినీతిపై విచారణ పూర్తిగా జరుగుతుంది. బీసీల రిజర్వేషన్లపై మా వ్యూహం తక్కువేమీ కాదు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం,” అన్నారు.

“Villains are always arrested in the climax,” Revanth said, adding that investigations into the previous administration’s scams are underway. “We have a clear strategy regarding BC reservations and will work in coordination with the central government,” he added.

అలాగే జలవివాదాలపై రాష్ట్రానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉందని తెలిపారు. మరోవైపు కేటీఆర్ డ్రగ్స్ కేసుపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. లోకేష్, కేటీఆర్ సమావేశం గురించి ప్రశ్నించారు. రాజకీయ నాయకుల భవిష్యత్తుపై ఈ సమావేశాల ప్రభావం ఏమిటో చూసుకోవాల్సి ఉంటుంది అన్నారు.

He also mentioned that the state has a clear roadmap on water-sharing issues. Regarding the drug case involving KTR, Revanth said that the probe is still ongoing. He questioned the nature of recent meetings between KTR and Lokesh, indicating that the political implications of such interactions should be closely observed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *