
కవిత తన సోదరుడి నాయకత్వాన్నే అస్వీకరిస్తోంది… అలాంటి కుటుంబంతో చర్చలు ఎందుకు?: సీఎం రేవంత్ రెడ్డి
Kavitha doesn’t accept her own brother’s leadership… Why should I negotiate with such a family?: CM Revanth Reddy
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో లీడర్షిప్‌ను స్వయంగా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ సోదరి కవిత కూడా ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
Telangana CM Revanth Reddy made sharp remarks on the internal leadership tussle within the BRS party, stating that even KTR’s own sister Kavitha doesn’t accept his leadership.
హైదరాబాద్‌లో ఈ రోజు ఓ మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ముందుగా వారి కుటుంబం ఒక్క తాటి మీదకి రావాలి. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో, స్లీపింగ్ ప్రెసిడెంటో నాకు తెలియదు. సూసైడల్ టెండెన్సీతో కొందరు బాధపడుతున్నారు. కవితకు ఆమె ఇంట్లోనే విలువ లేదు,” అని వ్యాఖ్యానించారు.
Speaking to the media in Hyderabad today, CM Revanth remarked, “Their family itself is not on the same page. I don’t know whether KTR is a working president or a sleeping president. Some people are suffering from suicidal tendencies. Kavitha has no value even in her own house.”
“నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. కేసీఆర్ నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. తెలంగాణకు జరిగిన నష్టానికి ఆయనే కారణం. 2004 నుంచి 2014 మధ్య 700 టీఎంసీలు రాయలసీమకు పంపారు. కానీ కేసీఆర్ హయాంలో కేవలం 12 టీఎంసీలే రాయలసీమకు తరలించారు,” అని సీఎం విమర్శించారు.
“I have no enmity with anyone. KCR is only a political rival to me. All the damage caused to Telangana is because of him. Between 2004 and 2014, 700 TMCs of water were sent to Rayalaseema, whereas under KCR’s rule only 12 TMCs were sent,” he alleged.
“అధికారం, డబ్బు వైరుధ్యాన్ని తెచ్చిపెడతాయి. కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్లు డ్రగ్స్ వాడతారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ చర్చకు వస్తే నేను సిద్ధం. కానీ బాత్రూమ్ కడిగే వాళ్లతో చర్చించను,” అంటూ రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
“Power and money lead to divisions. There are allegations that people around KTR are into drugs. If KCR wants to come for talks as opposition leader, I’m ready. But I won’t talk to people who clean bathrooms,” Revanth Reddy concluded sharply.