తెలంగాణ పారిశ్రామిక రంగానికి విశ్వస్థాయి లక్ష్యాలు…

Telangana Targets Global Investment in Biotech & Pharma

తెలంగాణ పారిశ్రామిక రంగానికి విశ్వస్థాయి లక్ష్యాలు | Telangana Targets Global Investment in Biotech & Pharma
తెలంగాణని ప్రపంచ పరిశ్రమల కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందడుగు వేస్తోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. Telangana CM Revanth Reddy stated that the state is determined to become a global hub for industries, offering complete support and infrastructure to investors.


శామీర్‌పేట జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ (ICHOR Biologics) కొత్త యూనిట్‌ భూమిపూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహంపై స్పష్టమైన ధోరణిని వెల్లడించారు. పెట్టుబడులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు, అనుమతులు, రాయితీలు ప్రభుత్వ పరంగా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ, ఐటీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఫార్మా, బయో సైన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని, పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే అన్ని విధాలుగా ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మారుతున్న ప్రస్తుత కాలంలో, తెలంగాణే అతిక్షేత్రంగా ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.

2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంలో తెలంగాణ 10 శాతం వాటా, అంటే 3 ట్రిలియన్ డాలర్ల రాష్ట్ర ఆర్థిక లక్ష్యాన్ని పెట్టుకున్నామని సీఎం తెలిపారు.

కోవిడ్ సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్‌లు రూపొందించి 100 దేశాలకు సరఫరా చేయగలగడం తెలంగాణ పరిశ్రమల సామర్థ్యాన్ని చాటిందన్నారు. ప్రస్తుతం దేశంలో 33 శాతం వ్యాక్సిన్‌లు, 40 శాతం బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి తెలంగాణ నుంచే జరుగుతుండటమే దీన్ని నిరూపిస్తున్నదని పేర్కొన్నారు.

జీనోమ్ వ్యాలీలో పెట్టుబడిదారులకు స్వాగతం పలుకుతూ, బయో-ఫార్మా రంగంలో అత్యాధునిక పరిశ్రమల కోసం ప్రభుత్వం మార్గం సుగమం చేస్తుందన్నారు. “మీ మద్దతు కావాలి… పెట్టుబడులు పెట్టండి” అంటూ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ధానం నాగేందర్, వివేక్, శాసనసభ్యులు, ఐకార్ బృందం పాల్గొన్నారు. ఐకార్ కొత్త వెబ్‌సైట్‌ను మంత్రి వివేక్ ప్రారంభించగా, మంత్రి శ్రీధర్ బాబు లోగో ఆవిష్కరించారు.


At the groundbreaking ceremony of ICHOR Biologics’ new unit in Genome Valley, CM Revanth Reddy reaffirmed Telangana’s commitment to making the state a global industrial destination. He assured that the government will provide investors with infrastructure, incentives, permissions, and proactive governance.

Addressing investors and industrialists, the Chief Minister invited investments in IT, Electric Vehicles, Pharma, and Life Sciences, stating that Telangana is working with a vision to emerge as the top destination in Asia, especially as industries look beyond China for expansion.

He said that by 2047, when India aims for a $30 trillion economy, Telangana targets contributing 10% (i.e., $3 trillion) from its own industrial and economic growth.

Recalling the state’s role during the COVID-19 pandemic, he proudly mentioned how Genome Valley produced vaccines for over 100 countries, showcasing Telangana’s manufacturing prowess. Today, 33% of India’s vaccines and 40% of bulk drugs are manufactured in the state.

Welcoming ICHOR Biologics and other biotech players, CM Revanth emphasized that Telangana is embracing the latest global standards and technologies. “We seek your support – come, invest in Telangana,” he concluded.

Ministers D. Nagender and Vivek Venkatswamy, along with ICHOR leadership, were present. Minister Sridhar Babu unveiled the company logo while Vivek launched the official website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *