బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిలా విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ అన్యాయం పై ఆమె తీవ్రంగా స్పందించారు.

Sharmila Targets Chandrababu Over Banakacharla, Slams BJP for Polavaram Injustice

బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిలా విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ అన్యాయం పై ఆమె తీవ్రంగా స్పందించారు.

విజయవాడలో ఆదివారం మాట్లాడిన షర్మిలా రెడ్డి, చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్‌ను తెరమీదికి తీసుకురావడమే అడ్వాన్స్ మొబైలైజేషన్ కోసమని, పోలవరం ప్రాజెక్ట్‌లో జరిగిన అన్యాయాన్ని దాచిపెట్టేందుకు ఇది ఒక వ్యూహమని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి లైఫ్‌లైన్ అయితే, బీజేపీ ప్రభుత్వం రాజకీయ స్వార్థాల కోసమే ప్రాజెక్ట్‌ను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.

2019లో 55 వేల కోట్ల అంచనా ఉన్న పోలవరం ప్రాజెక్ట్‌ను 2024లో 30 వేల కోట్లకు తగ్గించడం దారుణమన్నారు. ఎత్తు 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గించి 25 వేల కోట్లు మిగిల్చారని, కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఎంపీలు కూడా పార్లమెంటులో మాట్లాడకుండా నోరు మూసుకుని తుత్తులుగా మారారని విమర్శించారు.

అలాగే, కడప ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై సీవోయే అధికారులను కలిసి మాట్లాడినట్లు షర్మిల తెలిపారు. గత ప్రభుత్వంలో అనుమతులు లేకుండానే అడ్మిషన్లు జరగడం వల్ల విద్యార్థులకు సర్టిఫికెట్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఒక నెల గడువు ఇచ్చామని, సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Chandrababu is using the Banakacharla project as a diversion to shift attention from the Polavaram injustice, said APCC Chief Sharmila. She accused the BJP-led Centre of deliberately weakening the lifeline Polavaram project.

Speaking in Vijayawada, Sharmila said that bringing up the Banakacharla project was an excuse for advance mobilization, while the real issues like the downsizing of Polavaram are being buried. She alleged that the Polavaram project was killed to save ₹25,000 crore by reducing its height from 45 to 41 meters.

She criticized MPs for remaining silent in Parliament and accused the BJP of betraying Andhra Pradesh to stay in the Centre’s good books. Turning to local issues, she highlighted the plight of students at YSR Architecture University in Kadapa, who were denied certificates due to lack of COA approvals. She warned of taking the matter to Delhi if the issue is not resolved within a month.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *