CJI, CM Revanth Attend NALSAR 22nd Convocation in Hyderabad

నల్సార్ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్, సీజేఐ జస్టిస్ గవాయ్ పాల్గొన్నారు. విద్యార్థులకు పట్టాలు, పతకాలు అందజేశారు.
హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 22వ స్నాతకోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ యూనివర్సిటీ చాన్సెలర్ జస్టిస్ సుజయ్ పాల్ అధ్యక్షతన నిర్వహించారు.
సీజేఐ జస్టిస్ గవాయ్ విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ చట్టపరమైన విలువలపై ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, నల్సార్ వైస్ చాన్సెలర్ శ్రీకృష్ణ దేవరావుతో పాటు న్యాయ రంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో చట్ట, మేనేజ్మెంట్, డిప్లొమా కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి సీజేఐ, న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి కలిసి గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బీఏ ఎల్ఎల్బీ (హానర్స్), పీజీ డిప్లొమా పట్టాలు విద్యార్థులకు ప్రదానం చేశారు. చట్టానికి సంబంధించిన అంశాలపై నిపుణులు రచించిన పలు పుస్తకాలను కూడా ఈ వేదికపై ఆవిష్కరించారు.
Chief Justice of India Bhushan Ramkrishna Gavai and CM Revanth Reddy participated in the 22nd convocation of NALSAR University of Law held in Hyderabad. Supreme Court Judge P.S. Narasimha, Telangana High Court acting Chief Justice Sujoy Paul, and legal dignitaries were present.
The event, presided over by NALSAR Chancellor and acting Chief Justice of the High Court, Sujoy Paul, saw addresses from top legal figures. Justice Gavai delivered an inspirational address to the graduates, focusing on ethics and values in the legal profession.
During the convocation, students who excelled in various streams such as Law, Management, and PG Diploma programs were awarded gold medals by the dignitaries, including the Chief Minister. Degrees were conferred to students of LLM, MBA, BA LLB (Hons), and other PG diploma holders. The convocation also witnessed the release of several law-related books authored by legal experts.