టీటీడీ, తిరుమలలో జరిగిన ఈ సమన్వయ సమావేశంలో ఆలయ నిర్మాణాలు, పునరుద్ధరణపై చర్చించారు.

TTD–Endowments Department Hold Coordination Meeting in Tirumala

టీటీడీ, దేవాదాయ శాఖ మధ్య పెండింగ్ అంశాలపై సమీక్ష జరిపారు. తిరుమలలో జరిగిన ఈ సమన్వయ సమావేశంలో ఆలయ నిర్మాణాలు, పునరుద్ధరణపై చర్చించారు.

తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ, దేవాదాయ శాఖల మధ్య శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో జె. శ్యామలరావు, దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్ హాజరయ్యారు. రెండు శాఖల మధ్య పెండింగ్‌లో ఉన్న కీలక అంశాలపై సమీక్ష జరిగింది.

కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధుల విడుదల, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న ఆలయాల వివరాలు, ఆలయాల పునరుద్ధరణ, పరిరక్షణ పనుల పురోగతిపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. ఆలయ నిర్మాణాల్లో నాణ్యత, సమయపాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ సమీక్షలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ, దేవాదాయ శాఖ ఉపకార్యదర్శి సుధాకర్ రావు, ఏపీ దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ జి.వి.ఆర్. శేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Tirumala witnessed a key review meeting between TTD and the Endowments Department on Saturday, focusing on pending coordination issues. The discussions centered around temple construction, renovation, and fund disbursals.

The meeting took place at Annamaiah Bhavan in Tirumala, attended by Endowments Minister Anam Ramanarayana Reddy, TTD Chairman B.R. Naidu, Executive Officer J. Syamala Rao, and Endowments Secretary Vinay Chand. They reviewed major joint matters pending between TTD and the department.

Topics included the release of Common Good Fund (CGF), status of temple constructions under the Srivani Trust, and progress on renovation and protection of temples. Officials emphasized the importance of quality and timely execution of these projects.

Other participants included TTD Additional EO C.H. Venkayya Chowdary, JEO Veerabrahmam, Endowments Commissioner Ramachandra Mohan, TTD Chief Engineer Satyanarayana, Endowments Deputy Secretary Sudhakar Rao, and AP Endowments Chief Engineer G.V.R. Shekhar.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *