బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ ఎంట్రీ… 29 మంది సెలెబ్రిటీలపై కేసు నమోదుED enters Betting App promotion case; registers case on 29 celebrities

బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ ఎంట్రీ… 29 మంది సెలెబ్రిటీలపై కేసు నమోదు
ED enters Betting App promotion case; registers case on 29 celebrities

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక మలుపు తిరిగింది. బాలీవుడ్, టాలీవుడ్ సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రమోషన్‌లపై ఈడీ కేసు నమోదు చేసింది.

A major development unfolded in the Betting App promotion case as the Enforcement Directorate (ED) has officially registered a case against 29 celebrities and influencers from Bollywood and Tollywood, citing illegal promotions.

తెలుగు వార్తా కథనం:
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) రంగ ప్రవేశించింది. బాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మీ, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి సహా మొత్తం 29 మంది సెలెబ్రిటీలపై కేసు నమోదు చేసింది. చట్టవిరుద్ధ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు వారిపై ఈ చర్యలు తీసుకుంది.

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ యాప్‌లను ప్రచారం చేసి, ప్రజలను ఆకర్షించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలువురు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ యాప్‌ల వలన అప్పుల్లో కూరుకుపోయిన పలువురు యువతులు, యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.

ఈ కేసు ఆధారంగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్‌లపై విచారణ కొనసాగించిన ఈడీ, పంజాగుట్ట పోలీసుల వద్ద విచారణకు హాజరైన యాంకర్లు విష్ణు ప్రియ, రీతు చౌదరి, శ్రీముఖి, శ్యామలలపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఈడీ కేసు నమోదైన వారు: దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగెళ్ల, శ్రీముఖి, రీతు చౌదరి, శ్యామల, సిరి హనుమంతు, వర్షిణి, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పాండు, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత.

బెట్టింగ్ యాప్‌ల నిర్వహణలో కీలకులుగా ఉన్న కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ (సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు), యూట్యూబ్ చానెల్ ‘లోకల్ బాయ్ నాని’పై కూడా కేసులు నమోదయ్యాయి.

English News:
The Enforcement Directorate (ED) has taken over the investigation into the Betting App promotions case and filed a case against 29 celebrities including Vijay Deverakonda, Rana Daggubati, Lakshmi Manchu, Prakash Raj, Nidhhi Agerwal, Ananya Nagalla, Sreemukhi, and others.

These celebrities and social media influencers are alleged to have promoted illegal betting apps on platforms like Instagram and YouTube, influencing users to download and engage with these apps. Several complaints have been registered claiming that users fell into debt and even died by suicide due to these apps.

Based on FIRs filed by the Hyderabad and Cyberabad police, the ED initiated its probe. Anchors such as Vishnu Priya, Ritu Choudhary, Sreemukhi, and Shyamala were already questioned by Panjagutta police in connection with the case.

Prominent names booked by ED include Rana Daggubati, Prakash Raj, Vijay Deverakonda, Lakshmi Manchu, Pranitha, Nidhhi Agerwal, Ananya Nagalla, Siri Hanumanth, Varshini Sounderajan, Vasanthi Krishnan, Amrutha Chowdhury, Nayani Pavani, Neha Pathan, Imran Khan, Harsha Sai, Bayya Sunny Yadav, Taste Teja, and YouTube channel ‘Local Boy Nani’ among others.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *