
డిజిటల్ సేవలను వేగవంతం చేయడమే లక్ష్యంగా డిసిసి బ్యాంక్ సహకార రంగాన్ని ఆధునీకరించేందుకు అడుగులు వేస్తోంది. కమలాకూరు పాఠశాల సమస్యలపై స్పందించిన డిసిసిబి చైర్మన్ మౌలిక సదుపాయాల కల్పనకు హామీ ఇచ్చారు.
To speed up digital services, the DCCB is stepping forward to modernize the cooperative banking sector. Chairman responds to infrastructure issues of Kamalakur school with support assurance.
బద్వేలు: ఈ డిజిటల్ యుగంలో సహకార బ్యాంకింగ్ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా, ఖాతాదారులకు సులభంగా అందుబాటులో ఉండేలా చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో ఉన్న ముఖ్య లక్ష్యం. ఈ దిశగా ఉమ్మడి కడప జిల్లా డిసిసిబి బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సేవల అమలుకు తొలి అడుగులు వేయాలని చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.
ఈ క్రమంలో బుధవారం డిసిసిబి చైర్మన్ గీగా ఏఐ ఇండియా డైరెక్టర్ ఉమ్మడి రామ్మోహన్ బాబుతో భేటీ అయ్యారు. ప్రభుత్వ లక్ష్యాలను గమనించి తమ సంస్థ పూర్తిగా సహకరిస్తుందని రామ్మోహన్ పేర్కొన్నారు. తన కుమారుడు, గీగా ఎంల్ కో ఫౌండర్, CEO వరుణ్ ఉమ్మడి (Sanfrisco, USA)తో చర్చించి ఈ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు.
ఇప్పటికే గ్రామీణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సహకార రంగాన్ని ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నామని సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో కమలాకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జానపాటి శివనారాయణమ్మ తన పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలను వివరించారు. పాఠశాలలో ప్రహరీ గోడ లేకపోవడం, తరగతి గదులకు వాకిళ్లు, కిటికీలు సక్రమంగా లేకపోవడం, స్లాబ్ పై పెచ్చులు ఊడి పడటం వంటివి అభివృద్ధికి అడ్డంకులుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ అంశాలను స్వయంగా పరిశీలించిన డిసిసిబి చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.