విద్యాసంస్థల సమీపంలో మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసుల తనిఖీలు – కొన్ని షాపులకు జరిమానాలుPolice Crack Down on Sale of Intoxicants Near Schools – Penalties Imposed on Shops in Mummidivaram

విద్యాసంస్థల సమీపంలో మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసుల తనిఖీలు – కొన్ని షాపులకు జరిమానాలు
Police Crack Down on Sale of Intoxicants Near Schools – Penalties Imposed on Shops in Mummidivaram

డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పోలీసు విభాగం ప్రత్యేక తనిఖీలకు దిగింది. విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో గుట్కా, సిగరెట్‌ల వంటి మత్తు పదార్థాల విక్రయాన్ని నివారించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా షాపులపై తనిఖీలు చేపట్టారు.
Police in Mummidivaram, Dr. B.R. Ambedkar Konaseema district, conducted special inspections to curb the sale of intoxicating substances like gutka and cigarettes within 100 meters of educational institutions.

జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు ముమ్మిడివరం సీఐ మోహనకుమార్ నేతృత్వంలో ఎస్‌ఐ జ్వలసాగర్, పోలీసు సిబ్బంది బడ్డి షాపులు, టీ పాయింట్‌లలో తనిఖీలు జరిపారు.
As per SP B. Krishnarao’s directive, Circle Inspector Mohan Kumar, along with SI Jwala Sagar and team, inspected pan shops and tea stalls across the town.

విద్యార్థుల్లో మత్తు పదార్థాలపై ఆసక్తి పెరగకుండా ఉండేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా, నిబంధనలు ఉల్లంఘించిన పలు దుకాణాల యజమానులపై పెనాల్టీలు విధించారు.
The aim is to prevent exposure of students to harmful substances. Shopkeepers violating norms were penalized on the spot.

పోలీసు శాఖ ఈ తరహా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ఇది తప్పనిసరి చర్యగా పేర్కొనబడుతోంది.
Authorities have confirmed that such checks will continue regularly, emphasizing their commitment to protecting the future of students.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *