
కాంతార: చాప్టర్ 1 గ్రాండ్ రిలీజ్ అక్టోబర్ 2 | Vijay Sethupathi, Puri Jagannadh New Film Goes on Floors
‘కాంతార’ సినిమా మాయాజాలాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చేలా రూపొందుతున్న కాంతార: చాప్టర్ 1 షూటింగ్ పూర్తయింది. హీరో రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేశారు. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 2, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ ప్రీక్వెల్‌లో భారీ యుద్ధ సన్నివేశాలు ఉండనున్నాయి. 25 ఎకరాల్లో ప్రత్యేకంగా నిర్మించిన టౌన్ సెట్లో 500 మంది ఫైటర్లు, 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్న భారీ విజువల్స్‌ని తెరకెక్కించారు. ఈ విజువల్స్ ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచేలా ఉంటాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.
ఇక మరోవైపు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా విజయ్ సేతుపతి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా #పూరిసేతుపతి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రానికి చార్మీ కౌర్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. సంయుక్త కథానాయికగా నటించగా, టబు, విజయ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపొందిస్తున్నట్లు యూనిట్ తెలియజేసింది.