
యశస్వి జైస్వాల్‌కు అరుదైన ఘనత – టెస్టు చరిత్రలో వేగవంతమైన 2వేల పరుగుల మార్క్ చేరుకున్న తొలి భారత క్రికెటర్
India’s young opener Yashasvi Jaiswal made history by becoming the fastest Indian to reach 2000 Test runs, surpassing Sunil Gavaskar’s record. He achieved this rare milestone in just 21 matches, during the second Test against England, scoring his 2000th run at a personal score of 10 in the second innings.
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారత టెస్టు చరిత్రలోనే అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 10 పరుగుల వద్ద అతను 2000 టెస్టు పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 21 టెస్టుల్లోనే ఈ ఫీట్‌ను అందుకుని దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ (23 మ్యాచ్‌లు) రికార్డును అధిగమించాడు.
ఇన్నింగ్స్‌ల పరంగా చూసుకుంటే, జైస్వాల్ 40 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఇదే సంఖ్యలో రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు కూడా రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. దీంతో జైస్వాల్ వారితో సమానంగా నిలిచాడు. మరిన్ని ర్యాంకుల్లో విజయ్ హజారే (43 ఇన్నింగ్స్‌లు), గౌతమ్ గంభీర్ (43), గవాస్కర్ (44) ఉన్నారు.
ఒవర్‌ఆల్‌గా టెస్టు చరిత్రలో అత్యంత వేగంగా 2వేల పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్‌మాన్ (15 మ్యాచ్‌లు) పేరిట ఉంది. ఇతని తర్వాత జార్జ్ హెడ్లీ (17), హెర్బర్ట్ సట్‌క్లిఫ్ (22), మైఖేల్ హస్సీ (20), లబుషేన్ (20) ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 22 బంతుల్లో 6 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్‌కు 244 పరుగుల ఆధిక్యం ఉంది.