మోడీ, అమిత్ షా లకే కాదు..అరవింద్, బండి సంజయ్ లవి కూడా పేక్ డిగ్రీలే అని సంజయ్, అరవింద్ లవి ఫేక్ డిగ్రీలే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతల పై మండిపడ్డారు. మోడీ, అమిత్ షా బండి సంజయ్ లకి భయపడే కార్యకర్తలు కాదు బీ.ఆర్.ఎస్ కార్యకర్తలంటే..తాటాకు చప్పుళ్లకు ఉడుత ఊ పులకు భయ పడేది లేదన్నారు. తెలంగాణ కు రూపాయి ఇయ్యా అన్న కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేర్చకున్నారని అన్నారు. మోడీ,అమిత్ షాల డిగ్రీ ఫేక్ డిగ్రీలని కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ డిగ్రీ ఏది అని అడిగితే 20 వేల ఫైన్ వేశారని అన్నారు. మోడీ డిగ్రీ పీజీ డిగ్రీలు చూపెట్టు అంటూ సవాల్ విసిరారు. మోడీ,షా వే కాదు.. ఎంపీ అరవింద్, బండి సంజయ్ వి కూడా ఫేక్ డిగ్రీ లే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బయటకు వస్తాయని, వారు సభ్యత్వం కోల్పోతారని బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.సిసిసీ కార్నర్ వద్ద బీ.ఆర్.ఎస్. మహాధర్నా చేపట్టిందని అన్నారు. తెలంగాణకు సింగరేణి ఒక ఆర్థిక, సామాజిక జీవనాడిలాంటిదని అన్నారు. సింగరేణి నల్ల బంగారం.. తెలంగాణకు కొంగుబంగారమన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తుందని తెలిపారు. కేంద్రం కుట్రలకు నిరసనగా మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం కేంద్రాల్లో కార్మికులు బగ్గుమన్నారని అన్నారు. ఇప్పటికే పలుమార్లు గనుల వేలం ప్రక్రియ ప్రయత్నం చేసిన ప్రైవేటు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదని, మరోవైపు ఇవే గనులని నేరుగా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మరోసారి సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణ పల్లి, పెనగడప గనులను వేలం వేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. మార్చి 29 నుంచి మే 30 వరకు గనులకు వేలం వేసే ప్రక్రియను నిలిపివేసి నేరుగా సింగరేణికి గనులు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.సింగరేణికి అవసరమైన బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని కేసీఆర్ గారు డిసెంబర్ 7, 2021 కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్రం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కూడా తెగ నమ్మాలని కంకణం కట్టుకుందని ఆరోపించారు. లాభాల బాటలో వున్న సింగరేణికి.. భవిష్యత్తులో బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల బాట పట్టించాలన్న కుతంత్రం కేంద్రం చేస్తున్నదని మండిపడ్డారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ బండి సంజయ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి బొగ్గు గనులు వేలానికి పెట్టడం దుర్మార్గమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మోడీ దోస్త్ అదానీకి సింగరేణిని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. లాభాల్లో నడుస్తున్న సంస్థను నిర్వీర్యం చేయొద్దని డిమాండ్ చేశారు.ఇప్పటికే మూడుసార్లు వేలం ప్రకటన ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదన్నారు. మళ్లీ నాలుగోసారి 4 బొగ్గు గనుల వేలానికి ప్రకటన ఇచ్చారని చెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సింగరేణిని ప్రైవేటీకరించవద్దని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారని గుర్తుచేశారు. బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సింగరేణిని ప్రైవేటీకరించకపోతే బొగ్గు గనులను సంస్థకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలు చెప్పిన మాటవిూద నిలబడటం లేదని విమర్శించారు. లాభాల్లో నడుస్తున్న సంస్థకు గనులు కేటాయించాలన్నారు. సింగరేణిని అదానీకి అప్పజెప్పడానికి కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీజేపీ నేతలను సింగరేణి ప్రాంతాల్లో తిరుగనివ్వరని హెచ్చరించారు. పేపర్ లీకేజీల వ్యవహారం వెనుక కేంద్రం పెద్దల హస్తం ఉందని బాల్క సుమన్ ఆరోపించారు.విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎవరీ వదలొద్దని ప్రభుత్వాన్ని కోరారు.అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ మోడీ అని విమర్శించారు. బీజేపీ పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పార్టీ విధానాలన్నీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కూడా గనులు కేటాయించకుండా ఆ సంస్థను దివాలా తీయించిన కేంద్రం..అదే విష ప్రయోగాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తుందన్నారు..! పోరాటాల పురుటిగడ్డ అయిన తెలంగాణలో.. ఎట్టపరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వ కుట్రలను అడ్డుకుని తీరుతామన్నారు. ఇదే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి మాత్రం నామినేషన్ పద్ధతిన భారీగా లిగ్నైట్ గనులు కేటాయించింది. గుజరాత్ కు ఒక న్యాయం? తెలంగాణకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటీకరించమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటలన్నీ కల్లబొల్లి మాటలే.. అని వ్యాఖ్యానించారు.నవంబర్ 12 , 2022న రామగుండం పర్యటన సందర్భంగా సాక్షాత్తూ ప్రధానమంత్రే.. సింగరేణి బొగ్గుగనులను ప్రైవేటీకరించం అని మాటిచ్చి నిలుపుకోలేకపోయారని గుర్తుచేశారు. ఉత్పత్తిలోనూ, లాభాల్లోనూ, పిఎల్ఎఫ్ లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సింగరేణిని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పే దమ్ము కేంద్ర ప్రభుత్వంలోనే ఏ ఒక్కరికైనా ఉందా? అని ప్రశ్నించారు. సింగరేణి సంక్షోభంలోకి వెళితే దక్షిణ భారతదేశ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుందనే సంగతి ప్రధానికి తెలియదా అని ప్రశ్నించారు. సింగరేణి ప్రైవేటీకరణ అనేది కేవలం ఆరు జిల్లాల సమస్య కాదని, సమస్త తెలంగాణను దెబ్బతీసే అంశమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే భారీ కుట్రలో భాగంగానే ఇది జరుగుతుందన్నారు.రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న సీఎం కేసిఆర్ గారి సంకల్పాన్ని ఎలాగైనా దెబ్బతీయాలన్న కేంద్రం కుట్ర ఇందులో దాగి ఉందని మండిపడ్డారు. బోర్లపై ఆధారపడ్డ అన్నదాతల బతుకులు మళ్లీ బోర్లాపడేలా చేయాలన్నదే బీజేపీ దురుద్దేశమని స్పష్టంచేశారు. విద్యుత్ ఉత్పత్తిని దెబ్బతీసి.. తద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కరెంట్ లేకుండా చేయాలన్నదే కేంద్రం కుట్ర చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర థర్మల్ పవర్ జనరేషన్ లో సింగరేణి పాత్ర అత్యంత కీలకమైనదని, దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, గృహ అవసరాలకు 24 గంటల పాటు ఇస్తున్న నాణ్యమైన విద్యుత్ సరఫరాను అడ్డుకోవాలన్న దురాలోచనతోనే కేంద్రం సింగరేణిపై కక్ష కట్టిందన్నారు. రైతులతోపాటు రాష్ట్రంలోని దళిత, గిరిజన, కులవృత్తులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ ఫలాలను గండికొట్టాలని కేంద్రం చూస్తోందన్నారు.కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను తెలంగాణ బలంగా అడ్డుకోవడం, మోటర్లకు విూటర్లు పెట్టమని తెగేసి చెప్పడంతో కేంద్రం దొడ్డిదారిలో సింగరేణిపై కన్నేసిందని మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే జంగ్ సైరన్ మోగిస్తామని? మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించారు. సింగరేణిని ప్రైవేటీకరించే కేంద్రం కుట్రలు ఫలిస్తే.. తెలంగాణ రాష్ట్రం చీకటిమయం అవుతుందని, సింగరేణి కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని, వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాలలో రిజర్వేషన్లు, వారికిచ్చే బోనసులు, అలవెన్స్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా రద్దు అవుతాయని తెలిపారు. ఇప్పటికే సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రలపైన ఉద్యోగులు, కార్మికుల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని, వారికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి అండగా ఉంటుందన్నారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడి విజయం సాధించినట్టే నల్ల సూరీళ్ళకోసం కార్మికుల పక్షాన కొట్లాడుతామన్నారు.