మండల పరిధిలోని ఉరుకుంద గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు మంగలి ఉరుకుంద మరియు ఐకాన్ స్టార్ సేవాసమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున డ్రమ్స్ తో ర్యాలీ చేస్తూ బానసంచాలు పేలిస్తూ అల్లు అర్జున్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి అనాధలకు పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా డాక్టర్ డానియల్ సైకిల్ షాప్ డేనియల్ చిన్నబాబు పాల్గొన్నారు. తదనంతరం అల్లు అర్జున్ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ అల్లు అర్జున్ జన్మదిన అంటే మాకు పండుగ లాంటిదని తెలిపారు ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు మంగలి ఉరుకుంద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సేవాసమితి సభ్యులు ఉదయ్ కుమార్ గోవిందు గణేష్ రామ్ చరణ్ తేజ్ సంతోష్ రఘు వసంత నరేంద్ర పాల్గొన్నారు.