హాస్యం, నాస్టాల్జియా తో కూడిన విలేజ్ ఎంటర్‌టైనర్ త్వరలో థియేటర్లలోకి
Kothapallilo Oka Okkadu’ presented by Rana Daggubati, a nostalgic village entertainer, set for theatrical release soon

తెలుగు సినిమాకు లవ్ లెటర్‌గా రూపొందిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి తన స్పిరిట్ మీడియా బ్యానర్‌లో ప్రవీణ పరుచూరితో కలిసి నిర్మించారు.
Rana Daggubati continues to back content-driven Telugu cinema, and his latest presentation, Kothapallilo Oka Okkadu, is gearing up for release under his Spirit Media banner. He has once again collaborated with Praveen Paruchuri, who makes her directorial debut with this film.
ఇది లైట్ హార్ట్‌డ్ హాస్యంతో కూడిన పల్లెటూరి నాస్టాల్జిక్ ఎంటర్‌టైనర్. ‘C/o కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను నిర్మించిన ప్రవీణ పరుచూరి ఇప్పుడు దర్శకురాలిగా మారారు. ఈ సినిమా ఊహించని మలుపులతో సాగే గ్రామ యువకుడి కథ ఆధారంగా ఉంటుంది.
Set in a village backdrop, the film combines humor, nostalgia, and thought-provoking storytelling. Known for producing cult favorites like C/o Kancharapalem and Uma Maheshwara Ugra Roopasya, Praveen Paruchuri now dons the director’s hat, delivering a story that follows a young villager’s life as it takes unexpected turns.
లాస్ ఏంజిల్స్‌కి చెందిన అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకు కొత్త విజువల్ టచ్‌ను అందించగా, పాటలు, డ్యాన్స్ సీక్వెన్సులు, హాస్యంతో కూడిన ఉపకథలు ప్రేక్షకులను అలరించేలా రూపొందించబడ్డాయి.
An award-winning cinematographer from Los Angeles lends a fresh visual tone to the movie. The film promises an engaging experience with entertaining subplots, songs, and dance sequences.
‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఇది తెలుగుతనానికి ఓ ప్రేమ పత్రం లాంటి సినిమా.