
ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్
సిద్దిపేట
ప్రతీ ఒక్క ప్రజావాణి దరఖాస్తును పరిష్కరించి శనివారం లోగా ఆన్లైన్లో పొందుపరచాలని
జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు గరీమ అగ్రవాల్, అబ్దుల్ హైమద్ లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుండి వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు జిల్లా అధికారులతో ఇప్పటివరకు ప్రజవాణి కార్యక్రమాల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారం మరియు పెండింగ్ వివరాలు శాఖల వారీగా రివ్యూ చేసి జిల్లాలోని ప్రజలకు ప్రజావాణి కార్యక్రమం పై సదభిప్రాయం కలిగేలా అధికారులు వారి వారి శాఖలకు వచ్చిన ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేసి ఆయా వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని అన్నారు. ఒకవేళ ఆయా సమస్యలు మీ పరిధిలో లేనట్లయితే ఆ వివరాలను కూడా అర్జీదారుకు స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. సమీక్షా కు హాజరు కానీ జిల్లా అధికారుల నుండి సంజాయితీ కోరాలని కలెక్టరేట్ ఏవో ను ఆదేశించారు.
ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి 189 దరఖాస్తులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.