Sakshatkara Vaibhavotsavams at Srinivasa Mangapuram from June 30 – Full Schedule Inside

తిరుపతిలో జూన్ 30 నుండి మూడు రోజుల పాటు స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి, ఉత్తేజిత ప్రతినిధి, జూన్ 28: శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 2 వరకు మూడు రోజులపాటు సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఆవరణలో విద్యుత్, పుష్పాలంకరణలతో ప్రత్యేక శోభ కల్పించారు. వాహన సేవల కోసం పెద్దశేష, హనుమంత, గరుడ వాహనాలు సిద్ధం చేశారు.
జూన్ 30న తొలి రోజు రాత్రి 7 గంటలకు స్వామివారు పెద్దశేష వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తారు. జూలై 1న రెండో రోజు హనుమంత వాహనంపై, జూలై 2న మూడో రోజు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.
జూలై 03న పార్వేట ఉత్సవం
జూలై 3న ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాత్తుమొర అనంతరం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఉత్సవమూర్తులు పార్వేట మండపానికి వేంచేపు అవుతారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పార్వేట ఉత్సవం జరుగనుంది. ఇందులో ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
📌 Telugu News | Full Report in Telugu
ENGLISH NEWS
Elaborate arrangements have been made for the annual Sakshatkara Vaibhavotsavams at Srinivasa Mangapuram from June 30 to July 2.
Arrangements complete for Sri Kalyana Venkateswara Swamy’s Sakshatkara Vaibhavotsavams
Tirupati, June 28: The Sakshatkara Vaibhavotsavams of Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram temple will be held from June 30 to July 2. Special decorations with lights and flowers have been completed. The temple authorities have prepared Pedda Sesha, Hanumantha, and Garuda Vahanas for the vahana sevas.
On the first day (June 30), Swamy will bless devotees in the mada streets atop Pedda Sesha Vahanam at 7 PM. On the second day (July 1), he will appear on Hanumantha Vahanam, and on the third day (July 2), Garuda Vahanam will be used for the procession.
Parveta Utsavam on July 3
On July 3, after Thomala Seva, Koluvu, Panchanga Sravanam, Sahasranamarchana, and Shattumora, the utsava murthis will be taken to Parveta Mandapam between 7 AM and 11 AM. The Parveta Utsavam will be held from 11 AM to 2 PM. Asthanam, Vedic, and cultural events are also scheduled.
📌 Telugu News | Full Report in English