Warangal Horror: Woman Stripped, Tortured with Castor Seeds over Affair Allegation

వివాహేతర సంబంధం.. మహిళపై దారుణంగా దాడి, ప్రైవేట్ పార్ట్స్‌కి జీడి పోసిన సంఘటన చర్చనీయాంశం
హనుమకొండ జిల్లా తాటికాయలలో మానవత్వం మరిచిపోయే ఘటన
వివాహేతర సంబంధాలు ఓకే కుటుంబాన్ని కాకుండా, కొన్ని సమాజాలకే మచ్చ తెస్తున్న ఉదంతమిది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఒక మహిళపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంగా ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టి, అనంతరం వివస్త్రను చేసి చిత్రహింసలు పెట్టారు. మహిళ జననాంగాల్లో జీడిపోసి, మానవత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారు.
ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో బాధితురాలు తాటికాయల గ్రామానికి చెందిన మహిళ. పదేళ్ల క్రితం ఆమె ములుగు మండలం బోలోనిపల్లి వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె భర్త ఓ సమీప బంధువైన వివాహితతో సంబంధం పెట్టుకుని ఆమెతో కలిసి ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. భర్త వ్యవహారం తెలిసిన బాధితురాలు తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి వివరించింది. దీంతో ఆమె బంధువులు ఆ మహిళను పట్టుకుని తాటికాయల గ్రామానికి తీసుకొచ్చి, చెట్టుకు కట్టేసి, కొట్టారు. ఆగకుండా ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.
ఇద్దరికి గుండు గీయించి, “ఏ మందు పెట్టావు?” అంటూ ప్రశ్నిస్తూ ఆమెను జననాంగాల్లో జీడిపోసి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు విషయం తెలుసుకుని రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధితులు ఎక్కడ ఉన్నారన్న విషయమై స్పష్టత లేదు.
Extramarital affair turns brutal – Woman stripped, beaten, and assaulted with castor seeds in Warangal
Inhuman incident shocks Warangal district
An extramarital affair has led to a horrifying act of violence in Hanumakonda district. A woman was allegedly stripped, tied to a tree, beaten, and assaulted in her private parts with castor seeds by relatives of another woman, accusing her of having an affair with her husband.
The incident occurred five days ago in Tatikayala village, Dharmasagar mandal. The survivor, married for ten years to a man from Bolonipalli (Mulugu mandal), reportedly discovered that her husband eloped with a close female relative. She returned to her native village and informed her parents. In response, the victim’s in-laws and other relatives brought both the husband and his alleged partner back to the village, subjected them to beatings, shaved their heads, and, shockingly, stripped the woman and tortured her using castor seeds.
The police have since taken up the case, registered an FIR, and begun investigating the identities of those involved. As per sources, the whereabouts of the assaulted individuals remain unknown.