డాక్టర్‌ నరేష్‌ వికె, పవిత్ర లోకేష్‌, ఎంఎస్‌ రాజు, విజయ కృష్ణ మూవీస్‌ తెలుగు`కన్నడ ద్విభాషా చిత్రం ‘మళ్లీ పెళ్లి’ టీజర్‌ ఏప్రిల్‌ 13న విడుదల

నవరసరాయ డా.నరేష్‌ వికె పరిశ్రమలో 50 గోల్డెన్‌ ఇయర్స్‌ ని పూర్తి చేసుకున్నారు. నరేష్‌, పవిత్రా లోకేష్‌ కలసి నటిస్తున్న గోల్డెన్‌ జూబ్లీ ప్రాజెక్ట్‌ ‘మళ్లీ పెళ్లి’ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు`కన్నడ ద్విభాషా చిత్రానికి మెగా మేకర్‌ ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై నరేష్‌ స్వయంగా నిర్మిస్తున్నారు. మేకర్స్‌ ఇంతకుముందు విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, గ్లింప్స్‌ లో లీడ్‌ పెయిర్‌ అందమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ రోజు ఈ చిత్రం టీజర్‌ గురించి ఎక్సయిటింగ్‌ అప్‌డేట్‌తో వచ్చారు. టీజర్‌ ఏప్రిల్‌ 13న విడుదల కానుంది. నరేష్‌, విత్ర లోకేష్‌ అందమైన చిరునవ్వుతో లవ్‌ సింబల్స్‌ చూపిస్తూ కనిపించారు. నరేష్‌ సూట్‌ వేసుకోగా, పవిత్ర లోకేష్‌ చీరలో ఆకట్టుకున్నారు. జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత విజయకుమార్‌, అనన్య నాగెళ్ల, రోషన్‌, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్‌ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి సురేష్‌ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, అరుల్‌ దేవ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. ఎంఎన్‌ బాల్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జునైద్‌ సిద్ధిక్‌ ఎడిటర్‌. అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, భాస్కర్‌ ముదావత్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌.‘మళ్ళీ పెళ్లి’ ఈ వేసవిలో విడుదల కానుంది.
తారాగణం: డాక్టర్‌ నరేష్‌ వికె, పవిత్ర లోకేష్‌, జయసుధ, శరత్‌ బాబు, వనిత విజయకుమార్‌, అనన్య నాగెళ్ల, రోషన్‌, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్‌ యండమూరి, మధు తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *