రంజాన్ పర్వదినం నేపథ్యంలో ‘‘దావత్ఎ
రంజాన్’’ పేరుతో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా విూర్జా సోదరి ఆనం విూర్జా అధ్వర్యంలో మెహిదీపట్నంలోని కింగ్ ప్యాలెస్ లో 14రోజుల పాటు ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ప్రారంభించారు. ఈ నైట్ బజార్ ప్రదర్శన లో పిల్లలు మహిళలతో పాటు అన్ని వయస్సుల వారు ఇష్టపడే ఫ్యాషన్ దుస్తులతో పాటు రంజాన్ పండగకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువుల స్టాల్ల్స్ ఈ ప్రదర్శనలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 7 ఏప్రిల్ 2023 నుండి 21 ఏప్రిల్ 2023 వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది.
అబండేన్స్ నిర్మాణ సంస్థ అధ్వర్యంలో అనమ్ విూర్జా, ఆమె భర్త క్రికెటర్/లాయర్ అయిన అదుద్దీన్ మొహద్(భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మొహద్ కుమారుడు)తో కలిసి రెండో ఏడు ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని అతిపెద్ద ఎక్స్‌పో అయిన దావత్ఎ
రంజాన్ ఈవెంట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని కరిష్మా కపూర్ అన్నారు. హైదరాబాద్ అంటే చాలా ఇష్టం, చాలా రోజుల తర్వాత నేను హైదరాబాద్‌కి వచ్చాను, హైదరాబాద్ బిర్యానీ, హలీమ్ రుచులను ఎంతగానో ప్రేమిస్తానని అన్నారు.
ప్రదర్శనలో భాగంగా అనేక రకాల స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్ మరియు సరదాతో కూడిన అతిపెద్ద ప్రదర్శనగా ఇది నిలుస్తుందని ఆనం మిర్జా అన్నారు. ఈ నెల 21 వరకు ఈ వేడుక జరుగుతుందని అన్నారు. ‘‘నేను హైదరాబాదీని.. రంజాన్ మాసంలో అందరికీ ఇష్టమైన ఈ 14 రోజుల ప్రదర్శనను నగర వాసులకు అందుబాటులోకి తీసుకు రావడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో నడిబొడ్డు ఉన్న ఓల్డ్ సిటీలో ఈ ప్రదర్శనను తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉందని’’ అనమ్ విూర్జా అన్నారు. దావత్ఇ
రంజాన్ వేదిక భాగస్వామి అయిన అబండెన్స్ రీజినల్ హెడ్ మిస్టర్ జాకీ జియావుద్దీన్ అలీ మాట్లాడుతూ.. ఈ రకమైన ఈవెంట్‌తో అనుబంధం కలిగి ఉన్నందుకు చాలా గొప్పగా ఉందన్నారు. అబండెన్స్ మరియు దావత్ఎ
రంజాన్ మధ్య భాగస్వామ్యం సుస్థిరత మరియు పండుగ స్ఫూర్తి మధ్య సంబంధాన్ని ప్రస్ఫుటం చేస్తుందని అన్నారు. ప్రదర్శనలో గాజుల మెరుపులు, హలీమ్ సువాసన, ఇరానీ చాయ్ రుచి మరియు మెహందీ యొక్క మెరుపును ప్రతిధ్వనిస్తుందన్నారు.
అబండెన్స్ సంస్థ గురించి..
అబండెన్స్ అనేది అట్రియా గ్రూప్ ద్వారా నిర్మించబడుతున్న రాబోయే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్, మరియు ఈ సంవత్సరం దావత్ఎ
రంజాన్ యొక్క సహకార భాగస్వామిగా వ్యవహరిస్తుంది. సదాశివపేటకు సవిూపంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ 4000కు పైగా విల్లాలను కలిగి ఉంది. మే 2023లో అధికారిక లాంచ్ షెడ్యూల్ చేయబడి, అబండెన్స్ లాంచ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్‌టైల్స్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాము. తెలంగాణలో కూడా మెగా టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తాం.ప్రసంగంలో భాగ్యలక్ష్మి ఆలయాన్ని ప్రస్తావించిన ప్రధాని,ఇంతవరకూ ఏ ప్రసంగంలోనూ ఆలయం ప్రస్తావన తీసుకురాని మోదీసడన్‌గా మోదీ ఈ ప్రస్తావన తీసుకురావడంతో సర్వత్రా చర్చ.