ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న కలెక్టర్ పమేలా సత్పతి.. సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా అభినందన

Collector trusts Govt Hospital – CM Revanth Reddy applauds move through X: for Telugu News and English News kindly scroll down

Hyderabad:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాలు, అనుభవం ఉన్న వైద్యులు, సేవా దృక్పథం గల సిబ్బంది ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం తరచూ చెబుతోంది. కానీ ఈసారి ఈ నమ్మకాన్ని కార్యరూపంలోకి తేవడంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముందున్నారు.

తాజాగా ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకోవడం ద్వారా, ప్రజలలో ప్రభుత్వ వైద్య వ్యవస్థపై విశ్వాసాన్ని కలిగించారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గుర్తిస్తూ, Collector పమేలా సత్పతిని సోషల్ మీడియా వేదికగా అభినందించారు.
“ప్రభుత్వ దవాఖానల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకమే ఇప్పుడు అవసరం. పమేలా సత్పతి తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుంది” అని సీఎం పేర్కొన్నారు.

ప్రభుత్వ వైద్యసేవల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరగడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు.

Government hospitals in Telangana are equipped with modern facilities, experienced doctors, and dedicated healthcare staff. While the government often emphasizes this, Karimnagar District Collector Pamela Satpathy has now set a living example by opting to undergo a surgical procedure at a government hospital.

This bold and trust-driven decision has caught public attention and earned appreciation from Chief Minister Revanth Reddy, who took to social media to congratulate the Collector.

“What we need today is trust in the quality services available at government hospitals. Collector Pamela Satpathy has shown that trust through her decision, and it will inspire many,” the Chief Minister posted.

This action is being seen as a positive and powerful message towards strengthening public confidence in government healthcare institutions.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *