
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి… ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి :
గోదావరిఖని ఏసీపీ రమేష్.
పోలీస్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు.
గోదావరిఖని.
గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 13th డివిజన్ విటల్ నగర్ లో రోహిణి ఫౌండేషన్ వారి సహకారంతో పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి క్యాంపుకు రామ్ గోదావరిఖని ఏసిపి ఎం రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి లు హాజరై ఇట్టి మెడికల్ క్యాంపు ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఇట్టి ఉచిత మెడికల్ క్యాంపులో బిపి షుగర్, హెచ్ బి, ఓరల్ క్యాన్సర్, డెంటల్ సంబంధిత వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిచడం జరిగింది. పరీక్షలు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ…. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెడు అలవాట్లకి దూరంగా ఉండాలని, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ లు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. రోహిణి ఫౌండేషన్ సహకారంతో నిర్వహించే ఇట్టి ఉచిత మెడికల్ క్యాంపును అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రమేష్, డాక్టర్లు నిదిన్, అఖిల, ధనుంజయ్, అరుణ్, అఖిల, అసిస్టెంట్ శివ, విఠల్ నగర్ ప్రాంత ప్రజాప్రతినిధులు చుక్కల శ్రీనివాస్ కుక్కట్ల ఓదెలు, మల్లయ్య, రవి, రామ్ కుమార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.